Sunday, May 12, 2024
- Advertisement -

మోహన్ లాల్ మనమంతా టీజర్

- Advertisement -

మనమంతా – చంద్ర శేకర్ యేలేటి డైరెక్షన్ లో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు లో డైరెక్ట్ – ఫుల్ డెబ్యూ చెయ్యబోతున్న ఈ సినిమా ఇప్పటికే హైప్ ని సంతరించుకుంది .

తాజాగా విడుదల అయిన ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకోగా ఇందులో ఒకే ప్రాంతం లో ఉండే నలుగురు వ్యక్తుల కథలని ఆధారంగా చేసుకుని డైరెక్టర్ సినిమా నడిపించబోతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీ గా ఉన్న ఈ సినిమా బృందం నిన్న విడుదల చేసిన టీజర్ అందరి మనసుల్నీ హత్తుకుంది. సామాన్య ప్రేక్షకులనే కాక బాహుబలి లాంటి సూపర్ సినిమాలని డైరెక్ట్ చేసిన రాజమౌళి ని కూడా ఈ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది . ఈ విషయం రాజమౌళి స్వయంగా చెప్పడం విశేషం.

అందరూ బాహుబలి 2 కోసం ఎదురు చూస్తుంటే రాజమౌళి మనమంతా సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పడం విశేషం. చంద్రశేఖర్ ఏలేటి, మోహన్ లాల్.. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటేనే సినిమాపై ఆసక్తి కలుగుతోందని, సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నానని రాజమౌళి తెలిపారు. ఇక మోహన్ లాల్‌తో పాటు గౌతమి, ‘కేరింత’ ఫేం విశ్వంత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను వారాహి చలన చిత్రంపై సాయి కొర్రపాటి నిర్మించారు.

{youtube}L9vC1MoeqBY{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -