Monday, May 5, 2025
- Advertisement -

ఆ అవకాశం దక్కితే…బాహుబలి వెయ్యి కోట్ల రేంజ్ కు!

- Advertisement -

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ బాషల్లో కలిపి ఇప్పటి వరకూ బాహుబలి సినిమా ఆరువందల కోట్ల రూపాయల స్థాయికి చేరుకొని ఉంటుందని ఒక అంచనా.

అన్ని భాషల్లోనూ బారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా సర్వత్రా పాజిటివ్ టాక్ తో అలాంటి ఫీట్ ను సాధించింది.

ఇంకా తొలి వెర్షన్లే ఈ స్థాయి లో ఉంది.. రెండో పార్ట్ ఇంకెలా ఉంటుందో అనే ఆసక్తి అంతటా నెలకొని ఉంది. ఇదిలా ఉంటే.. బాహుబలి మొదటి పార్టే వెయ్యి కోట్ల రూపాయల రేంజ్ ను అందుకొనే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోందిప్పుడు.

ప్రస్తుతం బాహుబలి సినిమాను చైనాలో విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఒకవేళ  అదే జరిగితే ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయలను అలవోకగా చేరుకొంటుందనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. చైనా భాషలోకి డబ్ చేసి ఈ సినిమాను విడుదల చేయనున్నారట. అయితే చైనాలో ఈ సినిమాను విడుదల చేయడం అంత సులభం కాదు. ప్రతియేటా కేవలం యాబై విదేశీ సినిమాలు మాత్రమే విడుదల అవుతాయక్కడ.

అందుకే బాహుబలి పార్ట్ వన్ , పార్ట్ టూ రెండింటినీ కలిపి ఆ దేశంలో ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నారట ఈ సినిమా వాళ్లు. కనీసం అది జరిగినా.. బాహుబలికి భారీ స్థాయిలో కలెక్షన్లను సమకూరే అవకాశాలున్నాయి. ఎందుకంటే… చైనా మార్కెట్ చాలా విస్తృతమైనది. జనాభా విషయంలో మనకన్నా పై స్థాయిలో ఉన్న ఆ దేశంలో  ఇది వరకూ కొన్ని ఇండియన్ సినిమాలు కూడా భారీ స్థాయి వసూళ్లనే సాధించుకొన్నాయి కూడా! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -