Friday, May 10, 2024
- Advertisement -

షాకింగ్: బాహుబళికి 2/5 రేటింగ్ ఇచ్చిన క్రిటిక్‌..!

- Advertisement -

పలు భాషలలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న  బాహుబలి చిత్రం సోషల్ నెట్‌వర్క్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకే విదంగా ఉన్నాయి. ఇక థియేటర్ల దగ్గర బాహుబళి సందడి అంతా ఇంతా కాదు.

టికెట్ల అడ్వాన్స్ బుకింగ్‌ కోసం అభిమానులు థియేటర్ల ముందు బారులు తీరుతున్నారు. ఆన్‌లైన్‌లోనూ టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన ఈ బాహుబళి, ఇండియా సిల్వర్‌ స్క్రీన్‌పై మునుపెన్నడూ చూడని అద్భుత పోరాట సన్నివేశాలతో, అవతార్ సినిమా తరహాలో ఈ చిత్రం రాబోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన, ఏ టీవీ ఛానల్ పెట్టినా బాహుబళి గురించే మాట్లాడుతున్నారు. అంతలా ఈ చిత్రం జనాల్లోకి పాకిపోయింది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై ఒక రివ్యూ సంచలనం రేపుతోంది. అదేంటంటే దుబాయ్‌కి చెందిన ఒక మ్యాగజైన్ రివ్యూ రైటర్ మరియు క్రిటిక్ కీరా సంధు బాహుబళి చిత్రానికి 2/5 గా రేటింగ్ ఇస్తూ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈమె దుబాయ్‌కి చెందిన ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ అని తన ట్విట్టర్‌లో పేర్కొంది. అంతే కాకుండా ఎంతో అంచనాలతో సినిమాకు వెళుతున్న ప్రేక్షకులకు బాహుబళి నిరాశ పరుస్తుందని చెప్తోంది. ఆమె మరొక ట్వీట్‌లో కూడా బాహుబళిలో అందమైన సెట్స్ ఉన్నాయి కాని కంటెంట్ లేదు.
A beautiful body without soul  అని ఒక్క మాటలో బాహుబళి సినిమాను వర్ణించి అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వార్త విని ఆగ్రహానికి గురైన ప్రభాస్ ఫ్యాన్స్, ఒక అడుగు ముందుకేసి ఆమె ప్రొఫైల్ ‌ని వెరిపై చేసి ఫేక్ అని తేల్చారు. అంతే కాకుండా కొందరూ ఈమె అమ్మాయి కాదు ’గే’ అని ట్వీట్స్ చేశారు. మరికొందరు ఇది కేవలం పాపులారిటి కోసం చేసింది మాత్రమే అని తేల్చేశారు.

మరి కొద్ది గంటల్లో సరి కొత్త రివ్యూతో ఆద్యా మీడియా మీ ముందుకు వస్తుంది.       

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -