Friday, May 17, 2024
- Advertisement -

ధోనీ జాతీయ జట్టును అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడా?!

- Advertisement -

ఇప్పటికే క్రికెటర్లు వివాదాస్పదులుగా మారారు. ప్రత్యేకించి యువ ఆటగాళ్లపై అనే రకాల ఆరోఫణలున్నాయి. ఐపీఎల్ నేపథ్యంలో చాలా మంది క్రికెటర్ల జీవితాలపై మరకలు పడ్దాయి.

స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో సహా ఎన్నో వివాదాలున్నాయి. ఇలాంటి వాటిలో తలదూర్చి శ్రీశాంత్ వంటి వారు కెరీర్ లను నాశనం చేసుకొన్నారు. ఇక ఈ మధ్య నే రెండు ఐపీఎల్ టీమ్ లు కూడా సస్పెన్షన్ కు గురయ్యాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆధ్వర్యంలోని రితీ స్పోర్ట్స్ కార్యకలాపాల నుంచి బయటకు వస్తున్నట్టుగా ప్రకటించుకొన్నాడు సురేష్ రైనా. అందులో నంబర్ టూగా ఉండి ఇబ్బందులు పడలేనని.. తను స్వేచ్ఛను కోరుకొంటున్నానని రైనా ప్రకటన చేశాడు. మరి ఇన్ని రోజులూ ధోనీ, రైనాలు సన్నిహితుగా ఉండేవారు. రైనా చెన్నై సూపర్ కింగ్స్ , జాతీయ జట్టులో తప్పని సరి సభ్యుడిగా ఉండేవాడు. అయితే ఇప్పుడు జట్టులో ధోనీ హవా తగ్గింది. శ్రీనివాసన్ కు సన్నిహితుడు ధోనీ. అయితే ఇప్పుడు శ్రీనివాసన్ హవా కూడా తగ్గింది.

ఇలాంటి నేపథ్యంలో ఈ విషయాన్ని గమనించి ధోనీ కి రైనా దూరం అవుతున్నాడనే ప్రచారం జరుగుతోంది .అలాగే  ఆటతీరును కాకుండా.. తనకు సన్నిహితంగా ఉండే ఆటగాళ్లనే పరిగణనలోకి తీసుకొని వారికి ధోనీ జాతీయ జట్టులో ఉంచుకొన్నాడన్న ప్రచారం కూడా ఉంది. జడేజా వంటి ఆటగాళ్లు సరిగా ఆడకపోయినా.. ప్రపంచకప్ మొత్తం కొనసాగడానికి కారణం అలాంటి వారి పట్ల దోనీ చూపిన అండదండలే అనే ప్రచారం కూడా ఉంది. మొత్తానికి జట్టుకు కెప్టెన్ గా ధోనీ తన ఇష్టానుసారం వ్యవహరించాడని అనుకోవాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు దానికి కొంత తెరపడినట్టే కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -