Tuesday, May 21, 2024
- Advertisement -

బాహుబలికి మొగుడెవరు…?

- Advertisement -

బాహుబలి సినిమా రికార్డులను ఇప్పట్లో ఎవ్వరూ  అందుకోలేకపోవచ్చు. కాని రేపన్న రోజు ఆ రికార్డులను  క్లీన్ స్వీప్ చేసే రోజు రాకుండా ఉంటుందని కూడా  చెప్పలేం. దీనికి బెస్ట్ ఎక్జాంపుల్….ఇప్పటినుంచే మనటాప్ హీరోలు…. బాహుబలి తెలుగు వెర్షన్ రికార్డులను ఎలా తుడిచి

పెట్టాలా అని…. ఇప్పటినుంచే బుర్రలు బద్దలు కొట్టేసుకోవ‌డం.ఇంతకీ బాహుబలి రికార్డులను చెరిపేసే ఆ సత్తా… ఎవరికి ఉందా అని అపుడే టాలీవుడ్‌లో చ‌ర్చ మొద‌లైపోయింది. 

 

 ఆ ఫీట్ ను తెలుగు వెర్ష‌న్ వ‌ర‌కూ అందుకోగ‌ల స‌త్తా  ముందుగా ప‌వ‌న్ కే ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. బాహుబ‌లి మొద‌టి రోజు తెలుగు వెర్ష‌న్ ప‌రంగా 23కోట్లు సాధించింది. ఇది ప‌వ‌న్ గ‌త అత్తారింటికి దారేది కంటే ప‌ది కోట్ల‌కు పైగా ఎక్కువ‌గా ఉంది. మ‌రి గ‌బ్బ‌ర్ సింగ్ 2 ను ఈరోజు ఇంట‌ర్నేష‌నల్ 70కోట్ల‌కు పైగా వెచ్చించి ద‌క్కించుకుంది కాబ‌ట్టి…. బాహుబ‌లి ఎన్ని థియేట‌ర్ల‌లో అయితే రిలీజ్ అయిందో అన్నే థియేట‌ర్ల‌లో ఈసినిమా కూడా విడుద‌ల‌యితే మాత్రం ఖ‌చ్చితంగా తెలుగు వెర్ష‌న్ వ‌ర‌కు ఏమైనా అధ్బుతం జ‌ర‌గ‌వ‌చ్చు.

 

ప‌వ‌న్ త‌ర్వాత ఈ లిస్ట్ లో ఉన్న హీరోల్లో మ‌హేష్ బాబు,బాల‌య్య‌,చెర్రీ ల పేర్లు వినిపిస్తున్నాయి.ఒక వేల చిరు 150 సినిమా భాగా వ‌స్తే మాత్రం దాన్ని కూడా అంతే స్థాయిలో రిలీజ్ చేసి వండ‌ర్స్ క్రియేట్ చేయ‌వ‌చ్చు. సో ఏది ఏమైన‌ప్ప‌టికీ…. బాహుబ‌లికి మొగుడ‌వ్వ‌డానికి తెలుగులో చాలామంది హీరోలు కాచుకు కూర్చున్నార‌న్న‌మాట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -