Monday, May 20, 2024
- Advertisement -

బాహుబలి మళ్ళీ ఒచ్చింది

- Advertisement -

దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘బాహుబలి’ సినిమాను ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వినియోగించుకుంటున్నట్లుగా కనపడుతోంది. కొంత కాలం క్రితం వరకు పిల్లలు ఇష్టపడే తినుబండారాలు ‘బాహుబలి’ చిప్స్ పాకెట్స్ వంటివి మార్కెట్లో ఎక్కువగా సందడి చేసాయి.

తాజాగా ఈ జాబితాలో పాన్ మసాలా పాకెట్స్ కూడా చేరాయి. మసాలా ప్రియులను ఆకట్టుకునేందుకు  ‘బాహుబలి’ పేరుతో పాన్ మసాలా పాకెట్స్ ను రంగంలోకి దించి సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారస్తులు.

జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాలను ఈ విధంగా ఉపయోగించుకోవడం ఇలాంటి వ్యాపారస్తులకు సాధారణ విషయమే. గతంలో ‘పోకిరి, జల్సా, గబ్బర్ సింగ్, శ్రీమంతుడు’ తదితర సినిమాలు కూడా ఇదే కోవలో చిరు మార్కెట్ లో సందడి చేసాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -