Sunday, May 5, 2024
- Advertisement -

పనామా పేపర్స్ లో వైకపా జనాలు

- Advertisement -

పన్ను ఎగవేతకు స్వర్గధామంగా మారిన బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్ కు నల్ల డబ్బును తరలించిన పలు దేశాల రాజకీయ నాయకులు, బడా పారిశ్రామిక వేత్తలు ఆయా దేశాలకు పన్నును ఎగవేశారంటూ ‘పనామా పేపర్స్’ సంచలన విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ కోవలోనే ఆంధ్రప్రదేశ్ సర్కారుకు పన్ను కట్టకుండా పోగేసిన సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలిస్తున్నారంటూ తాజాగా విడుదల చేస్తున్న పలువురు ప్రముఖుల పేర్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేగడానికి కారణమవుతున్నాయి.

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆధ్వర్యంలోని హెరిటేజ్ ఫుడ్స్ కు చెందిన డైరెక్టర్ మోటపర్తి శివరామ వరప్రసాద్ పేరు ఇప్పటికే వెలుగు చూడగా, లేటెస్ట్ గా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వియ్యంకుడు, అరబిందో ఫార్మా అధినేత రామ్ ప్రసాద్ రెడ్డి, తెలంగాణలో రాజకీయ కురువృద్ధుడు దివంగత వెంకటస్వామి కుమారుడు జి.వివేక్ పేర్లు కూడా బయటకు వచ్చాయి.

‘ఆరెంజ్ గ్లో లిమిటెడ్’ పేరిట రామ్ ప్రసాద్ రెడ్డి వర్జిన్ ఐల్యాండ్స్ లో కంపెనీ పెడితే… వివేక్ మాత్రం తన భార్య సరోజతో కలిసి ‘బెలోరోజ్ యూనివర్సల్ లిమిటెడ్’ పేరిట కంపెనీని ఏర్పాటు చేశారట. అయితే, తామేమీ తప్పు చేయలేదని, నిబంధనల మేరకే సదరు కంపెనీలను ఏర్పాటు చేశామని ఈ ప్రముఖులంతా చెబుతుండటం విశేషం. సదరు రాజకీయ నాయకులే కాక, గంగిరెడ్డి పేరు కూడా ఉండడం మరో విశేషం. అయితే ఈ పేరు జగన్ కు సన్నిహితుడు, ఎర్రచందనం స్మగ్లర్ అయిన కొల్లం గంగిరెడ్డియేనా? లేక మరొక గంగిరెడ్డి ఎవరైనా ఉన్నారా? అన్న విషయం తేలాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -