Sunday, May 5, 2024
- Advertisement -

బాహుబలి అక్కడ టీవీలో ఆల్రెడీ ప్రసారం అయిపోయిందోచ్..!

- Advertisement -

ఒకవైపు బాహుబలి సినిమా గురించి మా టీవీ లో ప్రసారం కాబోతోందని ఊరి స్తున్నారు.

ఈ సినిమాను త్వరలో.. త్వరలో… ప్రసారం చేయబోతున్నామంటూ వారు ప్రకటిస్తున్నారు. బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ అయిన ఈ సినిమా టీవీల్లో కూడా సూపర్ హిట్ అవుతుందనడంలో సందేహం లేదు. అంటే జనాలు ఎగబడి టీవీల వద్ద ఈ సినిమాను చూసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ సినిమాను థియేటర్లలో చూసిన వారు, ఇంత వరకూ ఈ సినిమాను చూ  డని వారు టీవీల్లో ఈ సినిమా చూడటానికి ఆసక్తిని ప్రదర్శించే అవకాశం ఉంది.

మరి తెలుగులో ఈ సినిమా టీవీలో ఎప్పుడు వస్తుందనేది ఇంత వరకూతెలియరాలేదు.బహుశా దసరా సందర్భంగా ఈ సినిమా టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మా టీవీ వాళ్లు కోట్ల రూపాయలు వెచ్చించి శాటిలైట్  హక్కులు కొనుక్కొన్న ఈ సినిమాను దసరా సందర్భంగా ప్రసారం చేసే అవకాశాలున్నాయి. మరి తెలుగు సంగతిలా ఉంటే.. ఈ సినిమా మలయాళ వెర్షన్ మాత్రం ఎంచక్కా ప్రసారం అయిపోయిందప్పుడే.ఈ సినిమా నిన్న ఆదివారం మలయాళంలో ప్రసారం అయ్యింది. 

మలయాళ మనోరమ వారు ఈ సినిమాను ఆదివారం సాయంత్రం ప్రసారం చేశారు. ఈ విధంగా తెలుగు వెర్షన్ కన్నా పక్క భాష వెర్షనే ముందుగా టీవీలో ప్రసారం అయ్యింది. బాహుబలి సినిమా మలయాళంలో పెద్ద హిట్టే అయ్యింది. దీంతో టీవీలో ప్రసారానికి కూడా ఆదరణ దక్కి ఉండే అవకాశం ఉంది. ఇక తెలుగు వెర్షన్ టీవీ ప్రసారాల కోసమే వెయిటింగ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -