Saturday, April 20, 2024
- Advertisement -

నితిన్ వదులుకున్న దాన్ని రామ్ తెచ్చుకొని దెబ్బతిన్నాడా..!

- Advertisement -

మొత్తానికి ‘శివమ్’ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. విడుదల అయిన ఫస్ట్ షో నుంచే  ఈ సినిమాకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

నెగిటివ్ రివ్యూలు ఈ సినిమా కొంప ముంచాయి. సినిమా చూసొచ్చిన వాళ్లు పర్వాలేే అంటున్నా… రివ్యూయర్ల రేటింగులు  ఈ సినిమాకు మైనస్ గా మారాయి. ఇలాంటి నేపథ్యంలో భారీ బడ్జెట్ తోనే రూపొందించిన ఈ సినిమా తీవ్రమైన నష్టాలను చవి చూస్తోంది. ‘స్రవంతి’మూవీస్ వారు ముప్పై యేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను రూపొందించారు. 

ఎన్నో హిట్స్ ను రూపొందించిన బ్యానర్ లో ఇలాంటి డిజాస్టర్ రావడం విశేషం. మరి ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా ఈ స్క్రిప్ట్ నితిన్ చేయాల్సిందని… మొదటగా ఈ సినిమా కథను విన్నది నితనేనని తెలుస్తోంది. అయితే కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత  నితిన్ ఈ సినిమాను ఆపేశాడు. ‘శివమ్’ దర్శకుడు శ్రీనావాసరెడ్డి దర్శకత్వంలోనే నితిన్ సినిమా చేయడం మొదలుపెట్టాడు. కొంత షూటింగ్ జరిగిన తర్వాత నితిన్ ఆ సినిమాను ఆపేశాడు.

ఆ తర్వాత ఆ దర్శకుడు రామ్ తో సినిమాను మొదలు పెట్టాడు. అదే “శివమ్” అయ్యింది. ఇటీవల విడుదల అయ్యింది. దారుణమైన పరాజయాన్ని చవి చూస్తోంది. ఇదంతా చూస్తుంటే. నితిన్ వద్దనుకున్న కాన్సెప్ట్ ను నెత్తికెత్తుకుని రామ్అండ్ కో ఇబ్బందులను పడుతున్నట్టుగా ఉంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -