Tuesday, May 14, 2024
- Advertisement -

ఎట్టకేలకూ అనుకున్నది సాధిస్తున్న ఎన్టీఆర్..!

- Advertisement -

మొత్తానికి జూనియర్ఎన్టీఆర్ తను అనుకున్నది సాధిస్తున్నాడు.  ఈ ఫీట్ కొరటాల శివతో సినిమా విషయంలో.

ఆ దర్శకుడితో సినిమా చేయాలనేది ఎన్టీఆర్ ఇప్పటి కల కాదు. ఎప్పుడో మిర్చి సినిమా వచ్చినప్పుడే కొరటాలతో సినిమా చేయాలని ఎన్టీఆర్ ప్రయత్నించాడు. అయితే అది అప్పట్లో జరగలేదు. చాన్నాళ్ల చర్చల తర్వాత కొరటాల మహేశ్ బాబు వెంట వెళ్లిపోయాడు. మహేశ్ తో కూడా కొరటాల హిట్ కొట్టడం… ఇక ఇప్పటికీ ఎన్టీఆర్ సరైన హిట్ కొట్టలేకపోవడం జరిగింది.

ఇక ‘శ్రీమంతుడు’హిట్ తర్వాత కొరటాల విషయంలో ఎన్టీఆర్ వ్యూ ను వేరే వివరించనక్కర్లేదు. మామూలుగా కాదు.. ఒక రేంజ్ లో తపించిపోయాడు. శ్రీమంతుడు సినిమాను తను చేసి ఉంటే..చాలా సంవత్సరాలుగా కోరుకొంటున్న సూపర్హిట్ దక్కేదన్న లెక్కలతోనో ఏమో కానీ…ఎన్టీఆర్ కొరటాల కోసం చాలా ట్రై చేశాడు. మధ్యలో ఎన్టీఆర్ కు రవితేజ వంటి హీరోలు కూడా అడ్డు తగిలినట్టుగా వార్తలు వచ్చాయి. కొరటాలతో పాత సన్నిహిత్యం ఉన్న రవితేజ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అవి నిజం కాలేదు.

ఈ నెల ఆఖరి కల్లా ఎన్టీఆర్, కొరటాల సినిమా గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.విజయదశమి సందర్భంగా వారు  సినిమాను ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరి ఆ ప్రకటన ఎన్టీఆర్ ను, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఉత్సాహ పరుస్తుందనడంలో సందేహం లేదు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -