- Advertisement -

రెండో వారానికి బాహుబలి కలెక్షన్ల వివరాలు ఇవి.!

- Advertisement -

సంచలన స్థాయిలో విడుదల అయిన రాజమౌళి సినిమా బాహుబలి ఈ శుక్రవారంతో రెండో వారాన్ని పూర్తి చేసుకొంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

హిందీ, తమిళాల సంగతి ఎలా ఉన్నా.. తెలుగులో మాత్రం బాహుబలి ధాటి కొనసాగుతోంది. హిందీలో బజరంగీ భాయ్ జాన్ వంటి సినిమా విడుదల కావడంతో జోరుకొంత తగ్గినా. .తెలుగులో మాత్రం ధాటికొనసాగుతోంది.

 ఈ వారంలో “మా ఆవిడ జేమ్స్ బాండ్’ వంటి స్ట్రైట్ సినిమా, “జిల్లా’వంటి డబ్బింగ్ సినిమా విడుదల అయినా బాహుబలి క్రేజ్ కు మాత్రం లోటు లేదు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఈ సినిమా తెలుగు వెర్షన్ సాధించిన వసూళ్లను పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ సినిమా దాదాపు 87 కోట్ల రూపాయల వసూళ్లను సాధించినట్టుగా తెలుస్తోంది. ఇవి ఏపీ, తెలంగాణల్లో వసూలైన డబ్బులు మాత్రమే.

ఏరియాల వారీగా చూస్తే.. నైజాంలో ఇప్పటి వరకూ 32.09 కోట్ల రూపాయలు, సీడెడ్ లో 17.7 కోట్ల రూపాయలు, వైజాగ్ లో 7.49 కోట్ల రూపాయలు, గుంటూరులో 7.80 కోట్ల రూపాయలు, కృష్ణాలో 5.44 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరిలో 7.23 కోట్ల రూపాయలు, వెస్ట్ లో 6.05 కోట్ల రూపాయలు, నెల్లూరులో 3.03 కోట్ల రూపాయలను వసూలు చేసింది బాహుబలి సినిమా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -