Monday, April 29, 2024
- Advertisement -

కవితక్క.. రాహుల్ పై ఇలాంటి సెటైర్ వేసిందేంటి..?!

- Advertisement -

పుష్కరాలు అనేవి పవిత్రమైనవని హిందువులు భావిస్తారు. అయితే రాజకీయ నేతలు ఈ పుష్కరాలను ఉపయోగించుకొని ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకొంటున్నారు. పుష్కరాలను అడ్డం పెట్టుకొని సెటైర్లు వేస్తున్నారు.

తమకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కల్వకుంట్ల కవిత తీరును గమనిస్తే ఈ అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు కవిత. మరి రాహుల్ పై విమర్శలు చేయడానికి.. ఆయనను ఎద్దేవా చేయడానికి అనేక మార్గాలున్నాయి.

అయితే కవిత మాత్రం పుష్కరాలను ప్రస్తావిస్తూ రాహుల్ పై విమర్శలు చేసింది. రాహుల్ గాంధీ ఏపీ వరకూ వచ్చాడు కాబట్టి.. పుష్కర స్నానం చేయాల్సింది అని కవిత సూచించింది. ఇదేదో మంచి సూచన అనుకోవడానికి లేదు. ఎద్దేవా చేస్తూ కవిత అలా మాట్లాడింది. రాహుల్ గాంధీ పుష్కర స్నానాలు చేసి తన పాపాలను కడుక్కోవాల్సింది అని కవిత వ్యాఖ్యానించింది. రాహుల్ ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో తెలంగాణకు చెందిన కవిత ఇలా మాట్లాడింది!

మరి రాహుల్ పాపాత్ముడు అని.. పుష్కర స్నానం చేసి ఆ పాపాలను కడుక్కోవాల్సింది అని.. కవిత మాట్లాడటం సెటైరిక్ గానే ఉన్నా.. ఈ తరహా ఎద్దేవాలు అంత మంచివి కావనే చెప్పాలి. ఇప్పటి కే పుష్కర స్నానం చేసిన కవిత భక్తితో కాక.. తన  పాపాలను కడుక్కోవడానికే గోదావరిలో మునిగారా? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. అప్పుడు కవితమ్మ దగ్గర ఆన్సర్ ఏముంది?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -