Thursday, May 23, 2024
- Advertisement -

రాహల్ కు వైఎస్సార్ కాంగ్రెస్ గట్టి పంచ్ ఇచ్చింది..!

- Advertisement -

ఏపీ వరకూ వచ్చి తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని విమర్శించి వెళ్లిన కాంగ్రెస్ యువరాజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గట్టి పంచే పడుతోంది. ఏపీలో ప్రభుత్వం.. ప్రతిపక్షం రెండూ విఫలం అయ్యాయని అన్నాడు రాహుల్ గాంధీ.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను తెప్పించడంలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిలు విఫలం అయ్యారని కాంగ్రెస్ యువరాజు అన్నాడు. వాళ్లిద్దరూ బాద్యతా రాహిత్యంగానే వ్యవహరిస్తున్నారని రాహుల్ అన్నాడు.

మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీనో.. ఏపీకి వచ్చాడు కాబట్టి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడినో విమర్శించి ఉంటే అదో లెక్క. అయితే ఇలా ఉన్నట్టుండి తమ పార్టీ అధినేత జగన్ జోలికి వచ్చే సరికి వైకాపా ఎదురుదాడి చేస్తోంది. తమ అధినేతను ప్రతిపక్ష నేతగా విఫలం అయ్యాడని విమర్శిస్తున్న రాహుల్ కు ఉన్న సత్తా ఏమిటి?! అని వైకాపా వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అసలు రాహుల్ కు కేంద్రంలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించే దమ్ము కూడా లేకపోయింది కదా… అని వైకాపా వాళ్లు అంటున్నారు.

రాహుల్ ఎన్నికలకు ముందు వరకూ కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం పొందాడు. ఒకవేళ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే రాహుల్ ప్రధానమంత్రి అయిపోయేవాడు. అయితే అది జరగలేదు. కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కానీ.. ప్రతిపక్షంలో ఉండిపోయింది ఆ పార్టీ. ఇలాంటి నేపథ్యంలో రాహుల్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించలేదు. ఆయన ఆ సాహసం చేయడానికి ముందుకు రాలేదేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ప్రతిపక్ష పార్టీ నేతగా కూర్చోవడానికి భయపడిన రాహుల్..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతున్న జగన్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందని వైకాపా నేతలు అంటున్నారు. వీరి విమర్శలో సత్తా ఉందనే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -