Wednesday, May 1, 2024
- Advertisement -

దసరా కి బాహుబలి ?

- Advertisement -

తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతుంది అనుకుంటే భారత సినిమా ఖ్యాతిని అద్వితీయంగా పెంచేసింది బాహుబలి చిత్రం. సిల్వర్ స్క్రీన్ పైన ఇంకా రికార్డుల మీద రికార్డులు కొడుతూ దిగ్విజయం గా వంద రోజుల వైపు దూసుకు పోతోంది. 

ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల లో ఎక్కువ శాతం మంది చూసిన చిత్రం గా ముద్ర వెయ్యబడింది. ఇప్పటి వరకూ బిగ్ స్క్రీన్ మీద సృష్టించిన సంచలనాల తో సంతోషం చెందని బాహుబలి బుల్లి తెర మీద కూడా తన రేంజ్ చూపించడానికి వస్తున్నాడు.

ఇప్పటికే తెలుగు హిందీ వెర్షన్లను కూడా టెలికాస్టింగ్ రైట్స్ విక్రయించేశారు. తెలుగులో మాటీవీ బాహుబలి ప్రసార హక్కులు కొనుగోలు చేయగా.. హిందీలో సోనీ మాక్స్ దక్కించుకుంది. బుల్లితెరపై ప్రసారానికి సరైన టైంకోసం ఎదురుచూస్తున్నాయి ఈ ఛానల్స్. 

తెలుగులో దసరాకి టెలికాస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తుండగా.. హిందీలో కూడా పండుగ సీజన్ లోనే ఏదో ఒకరోజు టెలికాస్ట్ చేయచ్చని అంటున్నారు. హిందీ వారు దీపావళి దాకా ఆగచ్చునేమో కానీ తెలుగు లో’ మా’ వారు మాత్రం కచ్చితంగా దసరా కి టీవీ లో వేసేస్తారు అని విశ్వసనీయ సమాచారం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -