Saturday, May 25, 2024
- Advertisement -

రుద్రమ దేవి మీద కనికరం చూపించవయ్యా చరణూ !!

- Advertisement -

ఒక దర్శకుడిని లేదా నిర్మాతని ఆర్ధిక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ డబ్బులు ఇచ్చి ఆదుకోనక్కర లేదు.

పరోక్షంగా సహాయం చేసినా వారి కష్టాలు గట్టేక్కేస్థాయి. కానీ ఆ సాయం ఎవ్వరూ చెయ్యడానికి ఆసక్తి కూడా చూపించకపోవడం గుణశేకర్ పాలిట  శాపంగా మారింది. 

తనకి స్వగ్రామం లో ఉన్న సొంత ఆస్తులు తాకట్టు పెట్టి మరీ తెరకి ఎక్కించిన రుద్రమ దేవి కి చాలా కష్టాలు వస్తున్నాయి. ఆయన కోరుతున్న సాయం.. రెండు వారాలం విరామం. తన సినిమా వస్తున్నపుడు అటు ఇటు పెద్ద సినిమాల్లేకుండా కొంచెం గ్యాప్ ఇవ్వమంటున్నాడు. ఆ మాత్రం సహాయం మాత్రం ఎవ్వరూ చెయ్యడం లేదు. 

బాహుబలి సినిమా సమయం లో మాత్రం ఎవ్వరూ దరిదాపుల్లో తమ సినిమా విడుదల చెయ్యలేదు. తమ సినిమా చితికి పోతుంది అన్న భయం తోనో లేక మరేదైనా కారణం కావచ్చు మహేష్ బాబు సైతం శ్రీమంతుడు ని వాయిదా వేసేసుకున్నాడు.

ఇప్పుడు  రుద్రమ దేవి కి అక్టోబరు 9న రిలీజ్ డేట్ ప్రకటిస్తే ఇంకో వారానికే ‘బ్రూస్ లీ’ వచ్చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ విషయంలో హడావుడి పడుతుండటంతో విడుదల వాయిదా పడుతుందేమో అని చూశాడు గుణ. కానీ ఆ ఆస్కారం కనపడ్డం లేదు. అక్టోబర్ 16 న వచ్చే తీరుతుంది. కాబట్టి రుద్రమ దేవిని మళ్ళీ వాయిదా వేస్తారా అనిపిస్తోంది. సినిమా మీద ఇప్పటికే ఆసక్తి పోయేలా ఉంది. చూద్దాం ఏమవుతుందో. రాం చరణ్ కాస్త పరిస్థితి అర్ధం చేసుకుని అప్పుడు మహేష్ లాగా ఇప్పుడు తానూ వాయిదా వేసుకుంటే ఈ సినిమా గట్టెక్కుతుంది కదా !

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -