Tuesday, May 21, 2024
- Advertisement -

బాహుబ‌లి అమీర్ ను ‘పీకే’సాడా..?

- Advertisement -

అవును.అమీర్ సృష్టించిన పీకే రికార్డుల‌ను బాహుబ‌లి తొలిరోజే పీకేసాడు.ఐతే ఆ పీకేయ‌డం ఇక్కడ కాదు లెండి. యుఎస్ లో. యుఎస్ లో ఈసినిమా తొలిరోజు క‌లెక్షన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతోంది.

ఈసినిమా మొద‌టి రోజు ఒక మిలియ‌న్ డాల‌ర్లును సంపాదించింది. అంటే అక్షరాలు ప‌దిల‌క్షల డాల‌ర్లు.దాదాపు 5కోట్లుకు పైగా.గ‌తంలో అమీర్ చేసిన పీకే సినిమా కేవ‌లం 9ల‌క్షల డాల‌ర్లు మాత్రమే వ‌సూలు చేసింది.

ఇక డొమెస్టిక్ రికార్డుల విష‌యానికొస్తే ఈ లెక్క లో క్లారిటీ రావాలంటే మాత్రం తొలివారం ఆగాల్సిందే. హిందీ రివ్యూలు కూడా సూప‌ర్బ్ గా బాహుబ‌లి గురించి  స్పందిస్తూ రాస్తూ ఉండ‌డంతో బాహుబ‌లి ఉండే కొత్త చ‌రిత్ర సృష్టిస్తుందా అనే అనుమానం క‌ల‌గ‌క మాన‌దు.ఇక మ‌న ఓవ‌రాల్ గా మొద‌టి రోజు క‌లెక్షన్స్ చూస్తే…. 22 కోట్లు వ‌ర‌కు ఉంటుందంటున్నారు. ఈ లెక్కలో క్లారిటీ రావాలంటే మాత్రం ఇంకొన్ని గంట‌లు వెయిట్ చేయాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -