Tuesday, May 14, 2024
- Advertisement -

రామ్ చరణ్.. ఆ సంస్థకు సీఈవో..లాభాలు సంపాదిస్తాడా?!

- Advertisement -

ట్రూ జెట్ విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. శుక్రవారం ఉదయం అధికారికంగా ఈ సర్వీసుల మొదలయ్యాయి.  హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో దీని యాజమాన్యం ఈ విషయాన్ని ప్రకటించింది.

ఈ నెల 12 వ తేదీ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని వారు ప్రకటించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ విమాన సర్వీసులను నడిపే టర్బో మేఘా అనే కంపెనీకి సీఈవో హోదాలో ఉన్నది టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.

ఈ సంస్థ ద్వారా మెగా పవర్ స్టార్ ఏవియేషన్ రంగంలోకి ప్రవేశించాడు. చాలా రోజులుగా ప్రతిపాదనలో ఉన్న ఈ సర్వీసులు ఇప్పుడు ప్రారంభం అవుతుండటంతో రామ్ చరణ్ వ్యాపారం అధికారికంగా మొదలైంది. టర్బో మేఘా కంపెనీ సీఈవో హోదాలో  చరణ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించాడు.

మరి టాలీవుడ్ హీరోల్లో చాలా మందికి చాలా వ్యాపారాలే ఉన్నా.. ఇలా ఒక కంపెనీ సీఈవో హోదాలో మాత్రం ఎవరూ లేరు. ఇది చరణ్ కు మాత్రమే సొంతమైన ప్రత్యేకత. డొమెస్టిక్ సర్వీసులతో చరణ్ సంస్థ ప్రారంభం కాబోతోంది. మరి ప్రస్తుతానికి అయితే ఏవియేషన్ రంగంలో చాలా మంది నష్టాలనే మూటగట్టుకొంటున్నారు. కింగ్ ఫిషర్, స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ సంస్థలు నష్టాల్లోనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో చరణ్ విమానయాన సర్వీసులు ఎలాంంటి అనుభవాన్ని ఎదుర్కొంటాయో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -