Saturday, May 4, 2024
- Advertisement -

అమ్మో..! బాహుబళి టికెట్ ధర 5 వేలా?

- Advertisement -

అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న బాహుబళి సినిమాకు సంబందించి రోజుకో విషయం బయటికొస్తోంది. సాధారణంగా అగ్ర హీరో సినిమాల బెన్‍ఫిట్ షో విడుదలకు ముందే ఉంటుంది. చాలా మంది అభిమానులు ఈ షో కోసం పోటీ పడి 70 రూపాయల టికెట్‌ని 500 అని 1000 అని రేటు పెట్టి మరీ సినిమా చూస్తుంటారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న బాహుబళి సినిమాను కూడా బెన్‌ఫిట్ షో వేసేందుకు నిర్ణయం తీసుకున్నారట. అయితే ఛారిటీ పేరు చెబితేనే బెన్‌ఫిట్ షో కి అనుమతి లభిస్తుంది కాబట్టి ఆ కోవలోనే బాహుబళి టీం పోలీసుల అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం.  

ఇదిలా ఉండగా సినిమా టికెట్ ధర మాత్రం వేలల్లో నిర్ణయిస్తున్నారట. వెయ్యి, రెండు వేలు కాదు ఏకంగా ఐదు వేల రూపాయలు నిర్ణయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. బెన్‌ఫిట్ షో కూడా ఒకటి రెండు థియేటర్లలో కాకుండా పది, ఇరవై థియేటర్లలో వేయాలని బాహుబళి టీం సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఎంత పాపులర్, అంఛనాలు ఉన్న సినిమా అయినా ఈ రేంజ్ టికెట్ ధర పెట్టడం అందర్నీ నిరాశపరుస్తోందని కొంతమంది ప్రేక్షకులు వాపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -