Thursday, May 9, 2024
- Advertisement -

కౌశ‌ల్ ఆర్మీపై బాబు గోగినేని ఫైర్‌!

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ హోస్ నుండి గ‌త‌వారం బాబు గోగినేని ఎలిమినేట్ అయిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.హోస్‌మెట్ కౌశ‌ల్‌తో అత‌ను ప్ర‌వ‌ర్తించిన తీరుతోనే బాబు గోగినేని బ‌య‌టికి వ‌చ్చార‌ని అంద‌రికి తెలిసిందే.బ‌య‌ట ఉన్న కౌశ‌ల్ ఆర్మీ అత‌నికి వ్య‌తిరేకంగా ఓట్లు వేసి బాబు గోగినేని బ‌య‌టికి వ‌చ్చేలా చేశారు.బ‌య‌టికి వచ్చిన బాబు గోగినేని కౌశ‌ల్ ఆర్మీపై విమ‌ర్శ‌లు చేశారు.ఆయ‌న తాజాగా ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు…’బిగ్ బాస్ హౌస్ అనేది సైకలాజికల్ ప్రెషర్ కుక్కర్. అందులో మనం బతకగలమా..? లేదా..? అనేది షోకి వెళ్లిన ప్రతి ఒక్కరికీ తెలుసుకునే ఛాన్స్ ఉంది.

అక్కడ సరిగ్గా ఆహారం , నిద్ర ఉండ‌దు.మగాళ్లకు ఎమోషన్స్ ఉండవని అందరూ అనుకుంటారని ,కాని మ‌నిషి అనే ప్ర‌తివాడికి ఎదో ఇక ఏమోష‌న్ ఉంటుంద‌ని తెలిపారు. హోస్‌మెట్స్ అంద‌రితోను క‌లిసి ఉండాలి అంటే కుద‌ర‌ద‌ని,అంద‌రు ఒకేలా ఉండ‌ర‌ని చెప్పుకొచ్చారు.ఇది ఒక షో మాత్ర‌మేన‌ని ,ఎవ‌రో ఒక‌రు మాత్ర‌మే గెలుస్తార‌ని,బ‌య‌టికి వచ్చిన త‌రువాత ఎవ‌రి దారి వారిదేన‌ని ,మ‌రి అలాంట‌ప్పుడు ఒక మ‌నిషికి ఆర్మీలు,గీర్మీలు ఎందుక‌ని బాబు గోగినేని ప్ర‌శ్నించారు.అంత స‌రదాగా ఉంటే వెళ్లీ ఇండియ‌న్ ఆర్మీలో సేవలు చేయొచ్చు క‌దా అని హితబోద చేశారు.ఈ ప్ర‌స్తావ‌న‌లో బాబు గోగినేని ఎక్క‌డ కౌశ‌ల్ పేరు చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నాహం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -