Sunday, May 19, 2024
- Advertisement -

సర్వత్ర టెన్షన్… వాజ్ పేయి ఇంటిముందు బారికేడ్‌లు

- Advertisement -

గత కొద్ది కాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం మరింత క్షీణించింది. గురువారం ఉదయం మరో హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎయిమ్స్ వైద్యులు పరిస్థితి అలాగే ఉందని, వాజ్‌పేయి ప్రస్తుతం వెంటిలేషన్‌పై ఉన్నారని తెలిపారు. పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని తెలిపాయి.

వాజ్‌పేయి ఆరోగ్యంగురించి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ హెల్త్‌బులిటెన్ విడుద‌ల చేయ‌డంతో ఆయ‌న బంధువులు గ్వాలియ‌ర్‌నుంచి ఢిల్లీకి బ‌య‌లు దేరారు. వారిని తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్టు వార్తలు వెలువడటంతో, బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది

మ‌రో వైపు ఢిల్లీలోని వాజ్‌పేయి ఇంటి వ‌ద్ద బారికేడ్ల‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు భారీగా పోలీసుల‌ను మోహ‌రించారు. మ‌రో వైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి వద్దకు రాగా, మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ, మరోసారి ఆసుపత్రికి రానున్నారని అధికారులు వెల్లడించారు.

ఆసుపత్రి వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బంది, ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. మరోవైపు వాజ్ పేయి ఇంటి ముందు కూడా భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేసి, రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసి, రహదారిని బ్లాక్ చేయడంతో సర్వత్ర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -