Saturday, May 18, 2024
- Advertisement -

హౌస్‌మెట్స్ మ‌న‌స్థ‌త్వాలపై పుస్త‌కం రాస్తున్న బాబు గోగినేని..!

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో హేతువాది అయిన బాబు గోగినేనిని చూడ‌గానే అంద‌రు షాక్ అయ్యారు.ప‌లు టీవీ చ‌ర్చ వేధిక‌ల ద్వారా బాగా ఫేమ‌స్ అయిన బాబు గోగినేని బిగ్‌బాస్ హౌస్‌లో కూడా అదేవిధాంగా ఉన్నారు.షో మొద‌ట్లో పెద్ద‌గా ఎవ‌రితోను క‌ల‌వ‌ని బాబుగోగినేని షో న‌డుస్తున్న కొద్ది అంద‌రితోను క‌లివిడిగా ఉండ‌టం మొద‌లు పెట్టారు.ఇక కౌశ‌ల్‌తో గొడ‌వ పెట్టుకోవ‌డం ద్వారా ఆయ‌న బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చార‌ని చాలామంది న‌మ్ముతున్నారు.బిగ్‌బాస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన బాబుగోగినేని ప్ర‌స్తుతం ఓ పుస్త‌కం రాసుకునే ప‌నిలో ఉన్నార‌ని తెలుస్తుంది.

బిగ్‌బాస్ ద్వారా చాలా విషయాలను నేర్చుకున్నానని చెప్పారు. అన్నీ నాకే తెలుసంటూ హౌస్‌మెట్స్‌ చేత ‘బాస్‌’గా పిలిపించుకునే బాబుగారు కూడా ఈ షో నుండి ఎంతో కొంత నేర్చుకున్నానని చెబుతుండడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.ఈ షో ద్వారా ఎంత త్వ‌ర‌గా ఫేమ‌స్ అవ్వ‌చ్చో అంతే త్వర‌గా నెగిటివ్ కూడా అవుతార‌ని బాబుగారి అభిప్రాయ‌ప‌డుతున్నారు.ఇక బిగ్‌బాస్‌లోని త‌న అనుభ‌వాల‌తో పాటు,అక్క‌డ వాత‌వార‌ణం,ఎమోష‌న్స్ గురించి ఓ పుస్త‌కం రాస్తున్నారు బాబు గోగినేని.ఈ పుస్త‌కంలో మిగ‌త హౌస్‌మెట్స్ ప్ర‌వ‌ర్త‌న‌తో పాటు వారి మ‌న‌స్థ‌త్వాలు ఎలా ఉంటాయో చెప్ప‌బోతున్నారు.ఈ పుస్త‌కం త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -