Friday, May 17, 2024
- Advertisement -

పాండ్యా పాంచ్ ప‌టాకా….

- Advertisement -

ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరుగుతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఐదు వికెట్లతో చెలరేగాడు. టెస్టుల్లో మొదటిసారి ఐదు వికెట్ల హాల్ సాధించాడు. హార్దిక్ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లాండ్ 161 పరుగులకే కుప్పకూలింది.

తన సహచర సీనియర్‌ పేసర్లకు సాధ్యం కాని విధంగా, అటు వైపు అండర్సన్‌ కూడా ఆశ్చర్యపోయేలా బంతిని స్వింగ్‌ చేసి పడేశాడు. ఆఫ్‌ స్టంప్‌ లైన్‌ ఏమాత్రం తప్పకుండా కట్టుదిట్టమైన బంతులతో అతను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేశాడు. ఆడక తప్పని పరిస్థితి కల్పించి వికెట్లు పడగొట్టాడు. కెరీర్‌లో గత 15 ఇన్నింగ్స్‌లలో ఒకే సారి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీయగలిగిన పాండ్యా ఇప్పుడు మొదటిసారి ఐదు వికెట్లతో సత్తా చాటాడు.

పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత్.. మూడో టెస్టుపై పట్టు బిగించింది. ఐదు వికెట్ల హాల్ సాధించిన హార్దిక్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -