Wednesday, May 15, 2024
- Advertisement -

చిరంజీవి అభిమానులకి చేదు వార్త !

- Advertisement -

ఆగాడు లాంటి డిసాస్టర్ తరవాత చరణ్ తనతో సినిమా చెయ్యడానికి కూడా ఆలోచించకుండా రంగం లోకి దిగడం తో హిట్ సినిమా నే పరమావధి గా శ్రీను వైట్ల బ్రూస్లీ తెరకి ఎక్కిస్తున్నాడు. 

చివ్వరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీ గా ఉన్న ఈ సినిమా దసరా కానుకగా రాబోతోంది. ఈ సినిమా విడుదల మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. వివిధ రకాల ప్రత్యేకతలతో మేళవించి ఉన్న ఈ చిత్రం లో చిరంజీవి ప్రత్యేక పాత్ర ఇంకా పెద్ద విశేషం. చిరంజీవి నటించే 150వ సినిమా బ్రూస్‌లీయే కానుండడంతో అభిమానులు ఈ సినిమాలో చిరు ఎలా కనిపిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకూ అక్టోబర్ 1 న చిరంజీవి మీద ఫస్ట్ లుక్ విడుదల అవుతుంది అని ఊచించిన వారికి ఇది చేదు వార్త అనే చెప్పాలి. 

మనవద్దన ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎలాంటి ఫస్ట్ లుక్ ని కానీ ట్రైలర్ లో చిరంజీవి కి సంబంధించిన క్లిప్పింగ్ కానీ చూపించారట. ఇరవై ఎనిమిది నుంచీ చిరంజీవి మీద మూడు రోజుల పాటు షూటింగ్ జరుపుతారు. సీక్రెట్ గా ఉండడం కోసం ఈ షూటింగ్ జరిగే లొకేషన్ కూడా ప్రకటించలేదు మేకర్ లు.

ఇక అక్టోబర్ 2న ఈ సినిమా ఆడియోను విడుదల కానుండగా, అక్టోబర్ 16న సినిమా విడుదల కానుంది. చిరంజీవి ని ఫస్ట్ లుక్ లో చూద్దాం అనుకున్న వారి ఆశలు మీద నీళ్లు చేల్లెసినట్టే 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -