Saturday, May 18, 2024
- Advertisement -

మెగా వారింటమ్మాయి ఆ కుర్ర హీరో పక్కన హీరోయిన్ గానా!

- Advertisement -

ఎట్టకేలకూ నాగబాబు తనయ నిహారిక కొణిదెల హీరోయిన్ గా ఆరంగ్రేటం చేయడానికి రంగం సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది.

రెండు మూడు సంవత్సరాల కిందటే నిహారిక హీరోయిన్ గా చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో అది జరగలేదు కానీ.. ఇప్పుడు మాత్రం ఖాయమైనట్టుగా తెలుస్తోంది. 

విశేషం ఏమిటంటే.. ఆమె ఒక చోటా హీరో సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది. నాగశౌర్య పక్కన హీరోయిన్ గా కనిపించబోతోంది! మరి అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఇలా చిన్నహీరో పక్కన చేయడం విశేషమే!

అయితే ఈ సినిమా కథ నచ్చడం వల్లనే నాగబాబు తన కూతురు నటించడానికి సమ్మతించినట్టుగా సమాచారం. ‘మల్లెల తీరంలో సిరమల్లె చెట్టు’ సినిమా దర్శకుడు రామరాజు వినిపించిన కాన్సెప్ట్ నాగబాబు నచ్చిందని..దీంతో తన కూతురు హీరోయిన్్ పాత్ర చేయడానికి సమ్మతించాడని సమాచారం. 

మరి మెగా వారింటమ్మాయి ఇలా హీరోయిన్ గా నటిస్తే.. మెగా భిమానులు జీర్ణించుకోవడం కొంచెం కష్టమైన పనే. ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. మరి అన్ని కుదిరి నిహారిక కొణిదెల తెరపై కనిపిస్తే ఎలా ఉంటుందో.. హీరోయిన్ గా ఆమె కెరీర్ ఎలా ఉంటుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -