Friday, May 3, 2024
- Advertisement -

‘ఎల్లో’ మీడియా ఊరుకున్నా జాతీయ మీడియా ఊరుకోదు !

- Advertisement -

లోకల్ మీడియా కి చంద్రబాబు గారి మీద వల్లమాలిన ప్రేమ, ఆయన అధికారం లోకి రాకముందు నుంచే ” ఎల్లో ” జర్నలిజం అంటూ

ప్రతిపక్షాలు ఆరోపించినా ఇప్పుడు అధికారం లోకి వచ్చిన తరవాత కూడా దారుణమైన “ఎల్లో” జర్నలిజాన్ని చూపిస్తున్నాయి తెలుగు ఛానళ్ళు, రైతుల ఆత్మహత్యల కంటే అభివృద్ధి మీదనే మీడియా కన్ను ఎక్కువగా ఉంటుంది. అధికారం లోకి రాక ముందు దశాబ్దం క్రితం తాను చేసిన తప్పులు సరిచేసుకుంటాను అని ఇంకొకసారి జరగకుండా చూస్తాను అని మాట ఇచ్చిన చంద్రబాబు అధికారం లోకి రాగానే మళ్ళీ రైతుల మీద వివక్ష చూపిస్తున్నారు అనేది అందరి కళ్ళకీ చక్కగా కనిపిస్తున్న నిజం కానీ రైతుల తరఫున గొంతు ఎత్తడం కోసం ఏపీ లో ఒక్క ఛానల్ కూడా లేదు అంటే అది అతిశయోక్తి కాదు. 

నేషనల్ మీడియా ఈ విషయం లో చాలా హుందా గా ప్రవర్తిస్తోంది. ఏపీ రాష్ట్రము లోని పశ్చిమ గోదావరి జిల్లా లో వెంకటేశ్వర రావు అనే పొగాకు రైతు  ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయన చనిపోతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కి ఒక ఘాటైన లేఖ రాసాడు. 

ఆ లేఖ ప్రకారం ఆయన ప్రాధాన్యత రైతులకా ఇంకా ఎవరికన్నానా? అంటూ సూటి ప్రశ్న వేసాడు. రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ వార్త మామూలు గా వేసేసిన లోకల్ ఛానళ్ళు సూసైడ్ లేఖ మీద ఒక చిన్న వార్త కూడా ప్రచారం చెయ్యలేదు. దీనిపై సిఎన్‌న్ ఐబిఎన్‌లో బుధ‌వారం రాత్రి ప్ర‌త్యేక చ‌ర్చా కార్య‌క్ర‌మం ప్ర‌సార‌మైంది. 

ఒక వైపు ఎపి ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధి ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌, మ‌రోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ త‌ర‌పున రాజీవ్ కృష్ణ‌లు పాల్గొన్న ఈ చ‌ర్చ‌లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు రాసిన లేఖ‌ను సైతం స్క్రీన్‌పై ప్ర‌ద‌ర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -