Friday, May 10, 2024
- Advertisement -

ఒకేసారి ఇద్దరితో డేటింగ్ – పద్మాలక్ష్మి

- Advertisement -

సల్మాన్.. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను అంటోంది ఒకప్పటి మోడల్ పద్మాలక్ష్మి. ఇంతకీ సల్మాన్ అంటే కండర వీరుడు అనుకునేరు. కాదండి బాబు ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ. వీరిద్దరు గాఢంగా ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. ఏవో వివాదాలు వచ్చి ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం పద్మలక్ష్మి తన కుమార్తెతో కలిసి అమెరికాలో ఉంటున్నారు.

ఈ మధ్య ఎన్ డి టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పద్మాలక్ష్మి మాట్లాడుతూ రష్దీతో తాను ఎందుకు విడిపోయానో  ఇప్పటికీ తెలియడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇద్దరు మగాళ్లతో ఒకే సమయంలో డేటింగ్ చేశానని భారత సంతతికి చెందిన ఈ మెడల్ చెబుతోంది. తన దృష్టిలో ఇది తప్పు కాదని, అందుకే ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పింది.

‘లవ్, లాస్, అండ్ వాట్ వుయ్ యేట్: ఏ మెమొయిర్’ పేరుతో రాసిన పుస్తకంలో తన వ్యక్తిగత జీవితాన్ని ఆవిష్కరించానని పద్మాలక్ష్మి తెలిపారు. ఇప్పటి వరకూ తనలో గ్లామరస్ అంశాన్నే చూశారని, పుస్తకం విడుదలైతే తానేంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -