Friday, May 3, 2024
- Advertisement -

బాహుబలి 2 ప్రీ రిలీజ్ బిజినెస్

- Advertisement -
Baahubali 2: Film earns Rs 1000 crore before release

సినీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న బాహుబలి 2 మరి కొన్ని రోజుల్లో ధియేటర్ లో సందడి చేయబోతుంది . ప్రభాస్, అనుష్క , తమన్నా ,రానా కీలక పాత్రల్లో నటిస్తుండగా రాజమౌళి ఈ చిత్రాన్ని భారీ స్థాయి లో తెరకెక్కిస్తున్నారు .

ఇప్పటికే సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవ్వగా ట్రైలర్ ని మార్చ్ 15 న రిలీజ్ చేస్తుండగా, మార్చ్ 26 న మాయిష్మతి రాజ్యాన్ని నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ లో ఆడియో లాంచ్ వేడుకను నిర్వహించనున్నారు . 250 కోట్ల బారీ వ్యయం తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డ్ల వర్షం కురిపిస్తుందని అందరకీ తెలిసిందే.కాగా ఒక్క సారీ బాహుబలి 2 బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అంచనాలు ఎలా ఉన్నాయో చూద్దాం .

ఈ సినిమా రిలీజ్ కు ముందుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్ల మేరకు చేసింది .ఇప్పుడు బాహుబలి 2 1000 కోట్ల వరకు వసూళ్ళు సాధించవచ్చని సినీ విశ్లేషకుల అంచనా . మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాటిలైట్ రైట్స్ రికార్డు స్థాయి లో 130 కోట్లకు అమ్ముడు పోయింది . ఒక సౌత్ చిత్రం బాలీవుడ్ లో 120 కోట్లకు అమ్ముడు పోవడం ఇదే మొదటి సారీ. అమెరికా లో 45 కోట్లు , మొత్తం ప్రపంచం అంతా సాటిలైట్ రైట్స్ 500 కోట్ల వరకు అమ్ముడయ్యాయి అని తెలుస్తుంది . ఈ సినిమా ని ఏప్రిల్ 28న విడుదల చేయడనకి చిత్ర బృందం సర్వత్రా సన్నాహాలు చేస్తుంది . మరి చూడాలి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో!!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -