Friday, May 3, 2024
- Advertisement -

2 ట్రైలర్లు,4 క్లైమ్యాక్స్ లు.. వాట్ ఏ బాహుబలి స్ట్రేటజీ సర్ జీ!

- Advertisement -
Bahubali 2 Theatrical Trailer Release on 16th March

బాహుబలి-2 రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఎగ్జైట్ మెంట్ పెరిగిపోతోంది. ఈ ఎగ్జైట్ మెంట్ కు తగ్గట్లుగానే ఇటీవల బాహుబలి-2 మోషన్ పిక్చర్ ని రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా మరో రెండు పోస్టర్స్ ని విడుదల చేసింది.

అలానే ఈ నెల 16న ధియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదలచేయనున్నట్లు ప్రకటించింది. ఎంతో క్లారిటీతో ఉండే జక్కన్న బాహుబలి-2 విషయంలో మాత్రం కాస్త తికమక పడుతున్నాడట. దీంతో రెండు ట్రైల‌ర్‌ ల‌ను క‌ట్ చేసి ఉంచాడ‌ట‌. ఈ రెండింటిలో ఏ ట్రైల‌ర్ ని వ‌ద‌లాలా అనేది ఇంకా తేల్చుకోలేదట. అలానే జక్కన్న ఈ సినిమాకు నాలుగు క్లైమ్యాక్స్ లను రెడీ చేశాడట.  ఏ క్లైమ్యాక్స్ అయితే సినిమా రేంజ్ పెరుగుతుంది అనే విషయంపై జక్కన్న ఇంకా తర్జనభర్జనలు పడుతున్నాడట.

ఒక్కో భాషలో ఒక్కో క్లైమ్యాక్స్ ని ఫిక్స్ చేసే ప్లాన్ లో కూడా ఉన్నాడట.  అప్పుడు ఇతర భాషల క్లైమ్యక్స్ ఎలా ఉందోనని ఆసక్తితో ఆ  సినిమాలను కూడా అభిమానులు చూస్తారని అభిప్రాయపడుతున్నాడట. మరి ఫైనల్ గా ఏ క్లైమ్యాక్స్ ని వదులుతాడో లేక  కన్ఫ్యూజన్ లో ఒక్కో భాషలో ఒక్కో క్లైమ్యాక్స్ ని వదులుతాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -