Tuesday, May 21, 2024
- Advertisement -

కళ్యాణ్ రామ్‌కు పిలుపు వ‌చ్చింది …కాని ఎన్టీఆర్‌కు..

- Advertisement -

తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ సిద్ధం అవుతుంది.న‌టీన‌టులు ఎంపిక పూర్తి అయిన‌ట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో కళ్యాణ్‌రామ్‌కు అవ‌కాశం వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. తన తండ్రి హరికృష్ణ పాత్రలోనే కళ్యాణ్‌ రామ్‌ కనిపించబోతున్నాడు.అప్పట్లో ఎన్టీఆర్‌ అధికారంలోకి రావటానికి ఎన్నికల సమయంలో చేపట్టిన చైతన్య రథం ఓ కారణం.ఆ రథాన్ని నడిపింది ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణే. ఈ పాత్రకు కళ్యాణ్‌ రామ్‌ అయితేనే బావుంటుందన్న ఆలోచనతో ఆ నందమూరి హీరోను దర్శక,నిర్మాతలు సంప్రదించినట్లు తెలుస్తోంది.

మొన్నీమధ్యే ఐపీఎల్‌ ఈవెంట్‌లో జూనియర్‌ ఎన్టీఆర్ …ఎన్టీఆర్ బ‌యోపిక్ నుండి నాకు ఎటువంటి ఆహ్వ‌నం అంద‌లేద‌ని చెప్పాడు. ఈ సినిమాలో తారక్‌కు ఛాన్స్‌ దక్కే అవకాశం లేదన్నది తేలిపోయింది. సీనియర్‌ హీరో బాలకృష్ణ తండ్రి పాత్రలో నటిస్తూ. మరోపక్క నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రంలో బాలయ్య 72 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -