Saturday, May 4, 2024
- Advertisement -

ముంబ‌య్ ఇండియ‌న్స్‌కు పెద్ద ఎదురు దెబ్బ‌…

- Advertisement -

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆ జట్టు స్టార్ ఆటగాడు కమిన్స్‌ మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ కోసం నిర్వహించిన వేలంలో కమిన్స్‌ను ముంబయి ఇండియన్స్‌ రూ.5.4కోట్లకు దక్కించుకుంది.

దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిటెస్టులో కమిన్స్‌ వెన్నునొప్పితో తీవ్రంగా బాధపడ్డాడని, వైద్యపరీక్షలు నిర్వహించగా అతని వెన్నుపూసలో ఎముకకు గాయమైనట్లు తేలిందని ఆస్ట్రేలియా జట్టు ఫిజియో​ డేవిడ్‌ బేక్లీ తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో కమిన్స్‌ బౌలింగ్‌ చేయకపోవడమే మంచిదని, లేకుంటే గాయం తీవ్రమయ్యే ప్రమాదముందన్నాడు. ఈ నేపథ్యంలోనే అతను ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించడమే ఉత్తమమని నిర్ణయించినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం కమిన్స్‌ కోలుకుంటున్నాడని, త్వరలో మళ్లీ రీస్కాన్‌ చేసి అతను ఇంగ్లండ్‌ పర్యటనలో పర్యటించేది లేనిది ప్రకటిస్తామని డేవిడ్ తెలిపాడు.

తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ చేతిలో ఓడిపోయిన ముంబయి ఇండియన్స్‌ తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. హైదరాబాద్‌లో ఈ నెల 15న ఈ మ్యాచ్‌ జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -