Monday, May 13, 2024
- Advertisement -

సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో అంపైర్ల త‌ప్పిదం..

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌లో అంపైర్ల తప్పిదాలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. అంపైర్ల త‌ప్పిదం కార‌నంగా ఓ ఓవర్‌లో 7 బంతులు వేయించారు. ఈ విషయాన్ని ముందు ఎవ‌రూ గ‌మ‌నించ‌పోయినా క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా బహిర్గతం చేశారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన లాలిన్‌‌.. ఫీల్డ్ అంపైర్ల తప్పిదం కారణంగా ఏడు బంతులు వేయాల్సి వచ్చింది. ఏడో బంతికి ధావన్ ఒక పరుగు రాబట్టాడు. అయితే.. అప్పటికే 126 పరుగుల లక్ష్యఛేదనలో హైదరాబాద్ 103/1తో గెలుపు దిశగా సాగుతుండటంతో.. మ్యాచ్‌పై ఈ బంతి ప్రభావం పడలేదు. కానీ.. చివరి ఓవర్‌లో ఫలితం తేలే మ్యాచ్‌లకి పెట్టిందిపేరైన ఐపీఎల్‌ ఇలాంటి తప్పిదాలు కచ్చితంగా ప్రభావం చూపేవే.

థర్డ్ అంపైర్‌ కూడా ఈ తప్పిదాన్ని సరదిద్దేందుకు ప్రయత్నించలేదు. ఇలాంటి తప్పులు కొన్ని మ్యాచ్‌ల్లో ఎక్కువ మ్యూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -