సీనియర్ హీరో బాలకృష్ణ సీఎం కావాడానికి అంత సిద్ధం చేసుకుంటున్నారు. బాలయ్య ఏంటీ సీఎంగా ఏంటీ అనుకుంటున్నారా..? అవునండి మీరు వింటోంది నిజమే. బాలయ్య సీఎంగా కనిపించబోతున్నారు. అయితే ఇది నిజ జీవితంలో కాదు.. సినీ జీవితంలో బాలయ్య సీఎంగా కనిపించబోతున్నారు. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో బాలయ్య సీఎంగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్యకు ‘సింహా’, ‘లెజెండ్ వంటి సినిమాలతో రెండు హిట్లు ఇచ్చిన బోయపాటి హ్యాట్రిక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
సినిమా కథను బాలయ్యకు చెప్పడం ,కథకు బాలయ్య ఒకే చెయడం అన్ని జరిగిపోయాయని సమాచారం. సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టి ఎన్నికలలోపు సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించనున్నారని సమాచారం. అందులో ఒకటి ముఖ్యమంత్రి పాత్ర అని సమాచారం. ఇక బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్‌లో మహనాయకుడు సినిమాలో కూడా సీఎంగా కనిపించనున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’