పాన్ ఇండియా మూవీగా బాలయ్య అఖండ సీక్వెల్

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా…బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో గ‌త ఏడాది విడుద‌లై అఖండ విజ‌యం అందుకున్న మూవీ అఖండ‌. టికెట్ ధ‌ర‌లు పెంచ‌కుండానే ఈ సినిమాలో బాక్సాఫీసు ద‌గ్గ‌ర దుమ్మురేపింది. ఏకంగా 125 కోట్లు దక్కించుకుంది. బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అఖండ చివర్లో సీక్వెల్ ఉంటుందని బోయపాటి హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం అఖండ 2 సినిమాకు సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. రచయితలతో కథ గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే అఖండ తర్వాత బాలయ్యతో బోయపాటి ఓ పొలిటికల్ మూవీ తీయడానికి ప్లాన్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో దాన్ని విడుదల చేయాలని భావించారు. అయితే ప్రస్తుతం అఖండ 2ను తెరకెక్కించడంపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా అఖండ2ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

లెక్చరర్ గా పవన్ కల్యాణ్

ప్రేక్షకులకు రవితేజ ధమాకా

చిరంజీవితో రాధిక మూవీ

Related Articles

Most Populer

Recent Posts