Monday, May 6, 2024
- Advertisement -

బాలయ్య, బోయపాటి.. ఈసారి ఇండియా షేక్ అవ్వాల్సిందే !

- Advertisement -

కొందరి కాంబినేషన్లు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తూ ఉంటాయి. అలాంటి కాంబినేషన్లలో బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ వంటి సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి బ్లాక్ బాస్టర్స్ గా నిలిచియి. దీంతో ఈ కాంబినేషన్ పై కేవలం నందమూరి అభిమానుల్లోనే కాక తెలుగు సినీ అభిమానుల్లోనే భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరొక మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో మరొక మూవీ రాబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య 110 చిత్రం బోయపాటి దర్శకత్వంలోనే ఉండే అవకాశం ఉందట.

ఈ సారి వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే బాలయ్య కోసం ఒక పవర్ ఫుల్ పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో బోయపాటి స్టోరీ సిద్దం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలకు సంబంధించి అటు బోయపాటి గాని, ఇటు బాలయ్య కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయినప్పటికి ఈ కాంబినేషన్ లో మూవీ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగానే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా బాలయ్య ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాత బోయపాటి లైన్ లోకి వస్తాడని సమాచారం. ప్రస్తుతం బోయపాటి శ్రీను రామ్ పోతినేని తో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత బాలయ్య స్టోరీ పైనే కసరత్తు చేసే అవకాశం ఉందట. మరి నిజంగానే బాలయ్య బోయపాటి కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే మాత్రం.. వీరి మాస్ దండయాత్రకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయం.

Also Read

నాగార్జున పనైపోయిందా ?

ఎన్టీఆర్ కోసం రంగంలోకి బడా హీరో.. కొరటాల భారీ స్కెచ్ ?

“పుష్ప 2 ” ప్లాన్ మొత్తం మారిందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -