Monday, April 29, 2024
- Advertisement -

అల్లు అర్జున్ కోసం రాసిన కథలో ఎనర్జీటిక్ హీరో ?

- Advertisement -

అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ” పుష్ప ” మూవీ తెచ్చిన ఇమేజ్ తో నార్త్ లో తిరుగులేని మాస్ హీరో క్రేజ్ సంపాధించుకున్నాడు బన్నీ. అయితే పుష్ప కంటే ముందు బన్నీ కి మాస్ ఇమేజ్ కట్టబెట్టిన మూవీ ” సరైనోడు “. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆ టైమ్ లో అల్లు అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో బన్నీ మెకోవర్, యట్టిట్యూడ్ ఫ్యాన్స్ ను థ్రిల్ చేశాయి. మొదట మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికి ఆ తరువాత ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే బన్నీ తో సరైనోడు తీసే టైమ్ లోనే బోయపాటి అల్లు అర్జున్ కు మరో కథ కూడా వినిపించాడట. అయితే బన్నీ కి ఉన్న ఇతరత్రా కమిట్మెంట్స్ వల్ల అప్పుడు బోయపాటి కథను అల్లు అర్జున్ హోల్డ్ లో పెట్టడట. .

అయితే బన్నీ డేట్స్ ఇప్పట్లో దొరకడం కష్టమే అని భావించిన బోయపాటి.. అదే కథను వేరే హీరోతో తీసేందుకు సిద్దమయ్యాడట. ఆ హీరో ఎవరో కాదు రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి రామ్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ స్టోరీ మొదట అల్లు అర్జున్ కోసం సిద్దం చేసిన కథనేనట. అయితే కథలో సోల్ పాయింట్ అలాగే ఉంచి రామ్ కోసం కాస్త మార్పులు చేశాడట బోయపాటి. మరి అల్లు అర్జున్ కు సరైనోడు మూవీతో తిరుగులేని మాస్ ఇమేజ్ కట్టపెట్టిన బోయపాటి… అల్లు అర్జున్ కోసం రాసిన కథతో హీరో రామ్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి. ప్రస్తుతం రామ్ కు ఇస్మార్ట్ శంకర్ తరువాత సరైన హిట్ లేదు. ఆ మద్య వచ్చిన రెడ్, ఇటీవల వచ్చిన ది వారియర్ మూవీస్ అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. దాంతో బోయపాటి మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు రామ్. మరి బన్నీ కోసం రాసిన కథతో రామ్ పోతినేని ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఒకే దారిలో రాంచరణ్, అల్లు అర్జున్.. నిరాశలో ఫ్యాన్స్ ?

మహేశ్ బిస్ట్ మోడ్.. సిక్స్ పాక్ కోసమేనా ?

ఎన్టీఆర్ ను ఇబ్బంది పెడుతున్న ” అది పురుష్ ” !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -