Friday, May 3, 2024
- Advertisement -

సంక్రాంతికి వారు ఇన్… వీరు అవుట్

- Advertisement -

టాలీవుడ్ కు సంక్రాంతి…. రాను రాను మంచి మజాగా మారిపోతుంది. ముందు అనుకున్న సినిమాలు రకరకాల కారణాల వల్ల తప్పుకున్నా వాటి ప్లేస్ లో అంతకు మించిన సినిమాలు వస్తు పోటీని రసవత్తరంగా మార్చేస్తున్నాయి. దీంతో ఈసారి పొంగల్ ఫైట్ మాంచి జోష్ మీదుంది. వచ్చే సంక్రాంతికి వస్తాయనుకున్న చెర్రీ…. రంగస్థలం, మహేష్ భరత్ అను నేను… ఊహించని విధంగా బరి నుంచి సైడై పోయాయి. చివరకు పవన్-త్రివిక్రమ్ ల అజ్ఞాతవాసిని లైన్లో నిలబెడితే … బాలయ్యాబాబు… జై సింహ షూటింగ్ మొదలు పెట్టిన రోజే సంక్రాంతి పోటీలో ఉన్నామని చెప్పేశారు.

దీనికి తోడు పెద్ద హీరోలకు పోటీ ఇస్తానంటూ రాజుగాడుగా రాజ్ తరుణ్ వస్తున్నాడు. ఇక టచ్ చేసి చూడు అంటోన్న మాస్ రాజా రవితేజ సైతం సవాల్ విసిరేలా కనిపిస్తున్నాడు. నా పేరు సూర్య చిత్రం సంక్రాంతి బరిలో దిగే వరకు డౌటే. బట్ ఇక్కడ ఒకటి మత్రం వాస్తవం బాలయ్య, పవన్ , రాజ్ తరుణ్ లు సంక్రాంతి బరిలో కి దూకడానికి బెర్త్ లు కన్ఫామ్ చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -