Sunday, April 28, 2024
- Advertisement -

టాలీవుడ్ ట్రెండ్ టుడే తెలుసా..?

- Advertisement -

బుల్లితెరనుంచి వెండితెరపైకి డైరెక్టర్లుగా వచ్చి ఎవరికి వారు హిట్లు కొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈవిషయంలో ఓంకార్ సక్సెస్ అయ్యాడు. ఇదే బాటలో ఇప్పుడు మరో ఇద్దరు ముగ్గురు… డైరెక్షన్ చేసి తమ అదృష్టం పరీక్షించుకుందామని చూస్తున్నారు. రాజుగారి గది సిరీస్ హిట్ తో ఓంకార్ ఫుల్ ఖుషీలో మునిగిపోవడంతో…ఇక ఆతరువాత లిస్ట్ లో ఎవరున్నారనే దానిపై పరిశ్రమలో ఆసక్తి నెలకొంది.

ఈ లిస్ట్ లో ముందుగా ఈ టివి ప్రభాకర్ లైన్లో ఉన్నాడు. నెక్స్ట్ నువ్వే చిత్రంతో ఈ స్మాల్ స్క్రీన్ బడా బాస్ దుమ్ము దులపడానికి సమాయత్తమవుతున్నాడు. ఆతరువాత లిస్ట్ లో వెండితెరపై అదృష్టం పరీక్షించుకుందామని హర్షవర్దన్ చూస్తున్నాడు. ఇప్పటికే డైలాగ్ రైటర్ గా హర్షవర్దన్ సక్సెస్ అయ్యాడు.

ఇక వక్కంతం వంశీ సైతం ఆల్ రెడీ డైరెక్షన్ షురూ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. దీనికి అల్లు అర్జున్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. రేసుగుర్రంతో వక్కంతం వంశీలోని జిల్ బన్నీకి నచ్చిందట.ఒకవేల వీరిద్దరు కూడా సక్సెస్ అయితే… వీరిని ఆదర్శంగా తీసుకుని ఇంకొందరు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ట్రెండ్ టుడే పై టాలీవుడ్లో సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -