Thursday, May 16, 2024
- Advertisement -

ప‌దేళ్ళ త‌ర్వాత ఫ‌లించిన నిరీక్ష‌ణ‌…. ధావన్‌, రోహిత్‌ మెరుపులు…

- Advertisement -

ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జిరిగిన టీ20 మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో న్యూజిలాండ్‌పై కోహ్లీసేన 53 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పదేళ్ల వ్యవధిలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్‌కు ఓటమే ఎదురైంది. ఐతే ఎట్టకేలకు కివీస్‌కు ఈ ఫార్మాట్లో ఓటమి రుచి చూపింది భారత్‌. శిఖర్‌ ధావన్‌ (80; 52 బంతుల్లో 10×4, 2×6), రోహిత్‌ శర్మ (80; 55 బంతుల్లో 6×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్‌లతో భారత్‌కు భారీ స్కోరు అందిస్తే.. ఆ తర్వాత బౌలర్లు సమష్టిగా సత్తా చాటి కివీస్‌ను కట్టడి చేశారు.

న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా.. టీ20ల్లోనూ శుభారంభం చేసింది. మొద‌ట టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ శిఖర్‌ ధావన్‌ (52 బంతుల్లో 80; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (55 బంతుల్లో 80; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ షాట్లతో చెలరేగారు. తొలి వికెట్‌కు 158 పరుగులు జోడించిన వీరిద్దరు భారత్‌ తరఫున ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. చివర్లో కోహ్లి (11 బంతుల్లో 26 నాటౌట్‌; 3 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడాడు. అనంతరం న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేయగలిగింది.

న్యూజిలాండ్ జ‌ట్టులో లాథమ్‌ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. భారత బౌలర్లలో అక్షర్, చహల్‌ చెరో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌తో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నెహ్రా… తన ఆఖరి ఇన్నింగ్స్‌లో వికెట్‌ తీయకుండానే నిష్క్రమించాడు. తాజా ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టి20 శనివారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది.

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏ దశలోనూ న్యూజిలాండ్‌కు ఆదిలోనె దెబ్బ త‌గిలింది. రెండో ఓవర్లోనే స్పిన్నర్‌ను దించి భారత్‌ ఫలితం సాధించింది. చహల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన గప్టిల్‌ (4) హార్దిక్‌ పాండ్యా అత్యద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత భువనేశ్వర్‌ సూపర్‌ యార్కర్‌కు మున్రో (7) వెనుదిరిగాడు. అనంతరం విలియమ్సన్‌ (24 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్‌) ఆదుకునే ప్రయత్నం చేసినా అది సరిపోలేదు. ఒక ఎండ్‌లో లాథమ్‌ నిలబడ్డా… మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడ్డాయి. 16 పరుగుల వ్యవధిలో నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ ఇక కోలుకోలేకపోయింది. చివర్లో సాన్‌ట్నర్‌ (14 బంతుల్లో 27 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడినా కివీస్‌ విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -