Friday, May 17, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్……. బాలయ్య నిర్ణయానికి సర్వత్రా ప్రశంశలు

- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా……..అందులోనూ బాలయ్యే హీరో, బాలయ్యే నిర్మాత………అనే నిర్ణయం వెలువడినప్పటి నుంచీ నందమూరి అభిమానుల్లో కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఇక తేజను డైరెక్టర్‌గా ఎంపిక చేయడం……ఆ తర్వాత తన వళ్ళ కాదు అని చెప్పి తేజ చేతులెత్తేయడం లాంటి పరిణామాలతో సందేహాలు ఇంకాస్త ఎక్కువయ్యాయి. మహానటి రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ ఆలోచనను పక్కన పెట్టెయ్యమని బాలయ్యకు చాలా మంది సలహాలు ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలకు ముందు రిలీజ్ అయ్యేలా…..2019 ఎన్నికల్లో టిడిపికి హెల్ప్ అయ్యేలా ప్లాన్ చేయాలని నారా వారి నుంచి బాలయ్యపై ఒత్తిడి ఉందన్న విషయం తెలిసిందే. ఒక వైఎస్సార్ బయోపిక్ సినిమా వస్తుండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ బయోపిక్ ఉండాలని నారా వారి క్యాంప్ పట్టుదలగా ఉంది.

ఆ విషయాలు పక్కన పెడితే ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బాలయ్య తాజాగా తీసుకున్న నిర్ణయం మాత్రం బాగుంది. ఇంతకుముందు వరకూ కూడా సామాన్యుడైన ఎన్టీఆర్ మహానటుడిగా ఎదగడం వరకూ ఉండే కథను ఒక సినిమాగానూ……. రెండో పార్ట్‌గా సినిమా స్టార్ అయిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం వరకూ రెండు పార్ట్‌గా రెండు సినిమాలు అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా రెండు పార్ట్‌లు అంటే ఆసక్తి తగ్గిపోతుందని మొత్తం కథను ఒక సినిమాగానే తీయమని బాలయ్యకు ఎప్పటి నుంచో టిడిపి జనాలు, టిడిపి సినిమా పెద్దలు సలహాలు ఇస్తూ ఉన్నారు. రెండు సినిమాలు అంటే బడ్జెట్స్ కూడా పరిమితి దాటిపోతాయన్న విషయం అర్థం చేసుకున్న బాలయ్య తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మొత్తం ఎన్టీఆర్ జీవితకథను ఒక సినిమాగానే తెరకెక్కించనున్నాడు. ఎన్టీఆర్ మహానటుడిగా ఎదగడం……..ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం వరకూ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -