- Advertisement -

‘శాతకర్ణి’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తెలిస్తే షాకే.. బాలయ్య కెరీర్ లోనే ఇది రికార్డు!

- Advertisement -
balakrishna Gautamiputra Satakarni 7 days worldwide collections

బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో ఉన్న మరో రెండు చిత్రాలకు ధీటుగా పోటీనిస్తూ ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించింది. కేవలం ఏడు రోజుల్లోనే ఈ చారిత్రాత్మక సినిమా రూ.40 కోట్ల క్లబ్‌లోకి చేరి.. వరల్డ్‌వైడ్‌గా బాలయ్య స్టామినా ఏంటో చాటిచెప్పింది.

టాలీవుడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఫస్ట్ వీక్‌లో రూ. 42.59 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచే ఈ చిత్రం రూ.31.49 కోట్లు కొల్లగొట్టింది. కేవలం వారం రోజుల్లోనే ఈ రెంజ్ లో వసూళ్లు రావడం బాలయ్య కెరీర్‌లోనే రికార్డ్.  ‘ఖైదీ నెం.150’, ‘శతమానం భవతి’ సినిమాల పోటీమధ్య కూడా ఈ సినిమా ఈ రేంజ్ వసూళ్లతో దూసుకెళ్లడం నిజంగా విశేషం. ఈ రిజల్ట్‌ని బట్టి చూస్తుంటే.. త్వరలోనే ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరిపోతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 

ఏరియాల వారీగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (కోట్లలో) :

నైజాం : 7.30

సీడెడ్ : 6.40

వైజాగ్ : 3.95

గుంటూరు : 3.65

వెస్ట్ గోదావరి : 3.06

ఈస్ట్ గోదావరి : 2.98

కృష్ణా : 2.57

నెల్లూరు : 1.58

ఏపీ+తెలంగాణ : రూ. 31.49 కోట్లు

యూఎస్ : 5.60

కర్ణాటక : 3.50

రెస్టాఫ్ ఇండియా+వరల్డ్ : 2.00

టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 42.59 కోట్లు

Related

  1. గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ!
  2. శాతకర్ణి పై వర్మ కామెంట్స్.. ఖైదీ పై సెటైర్స్
  3. శాతకర్ణి సినిమాపై రివ్యూ తెలిపిన రాజముళి!
  4. శాతకర్ణి సినిమాలో అనసూయ పాత్ర ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -