Tuesday, May 21, 2024
- Advertisement -

బాలకృష్ణ వారసుడు మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ కథ ఇదే!

- Advertisement -
mokshu debut movie story

బాలయ్య కేరీర్ లోనే తిరుగులేని సూప‌ర్ హిట్‌ అందుకుంది గౌతమిపుత్ర శాతకర్ణి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ.. తన వారసుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీకి అప్పుడే అన్ని రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం శాత‌క‌ర్ణి ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా యూఎస్‌లో ప‌ర్య‌టిస్తోన్న బాలకృష్ణ అక్కడ నుంచి రాగానే త‌న కొత్త చిత్రంతో పాటు తన కుమారుడి చిత్రం కథా చ‌ర్చ‌ల్లో పాల్గొంటాడ‌ని తెలుస్తోంది.

ఇక మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీకి సైతం బాల‌య్య ఓ హిస్టారిక‌ల్ కథనే ఎంచుకోనున్నట్టు తెలుస్తోంది. మోక్ష‌జ్ఞ ఎంట్రీకి హిస్టారిక‌ల్ మూవీ అయితేనే క‌రెక్ట్ అని.. అందుకే అదే త‌ర‌హా క‌థాంశంతో మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న గుస గుసలు వినిపిస్తున్నాయి. తనకు అద్భుత విజయాన్ని అందించిన క్రిష్ దర్శకత్వంలో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం చేసే ఆలోచ‌న‌లో బాల‌య్య ఉన్నాడ‌ట‌.

ప్రస్తుతం శాత‌కర్ణి విజయంను ఎంజాయ్ చేస్తున్న క్రిష్.. తన తదుపరి సినిమాని అగ్రహీరో విక్ట‌రీ వెంకటేష్‍తో చేయనున్నాడు. ఈ చిత్రం థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కనుందంట. ఈ చిత్రం తర్వాత మరోసారి బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు కంప్లీట్ అయ్యాక గౌతమిపుత్ర శాతకర్ణికి సీక్వల్ గా శాతకర్ణి కుమారుడు వాశిష్టిపుత్ర పులుమావి కథతో మరో భారీ చారిత్రక చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఈ చిత్రంతోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

Related

  1. అఖిల్ పై ఘోరమైన కామెంట్స్ చేసిన బాలయ్య
  2. ఆ హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య!
  3. ఖైదీ పాటలకు స్టెప్పులు వేసిన బాలయ్య!
  4. బన్నీపై ఫైర్ అవుతున్న.. పవన్, బాలయ్య ఫ్యాన్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -