Saturday, May 18, 2024
- Advertisement -

టీడీపీ అధికారంలో ఉంది కాబట్టే.. లెజెండ్ ఆడుతోందా?!

- Advertisement -

60 వారం..అంటూ లెజెండ్ సినిమా గురించి ప్రకటన ఇచ్చారు. మీడియా ద్వారా ఈ విషయాన్ని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే..అంటూ బాలయ్య చేత చెప్పిస్తూ ఈ సినిమా గురించి ప్రచారం చేస్తున్నారు. మరి ఇంత వరకూ బాగానే ఉంది. ఒకవైపు బాలయ్య తాజా సినిమా ‘లయన్’ గురించి పట్టించుకోవడం లేదు కానీ.. ఇప్పుడు ‘లెజెండ్’ గురించిమాత్రం ప్రచార మార్మోగిపోతోంది.

అయితే ఈ విషయంలో కొన్ని సెటైర్లు పడుతున్నాయి.ఏ సినిమా అయినా తొలి వారానికి మించి నడవడం కష్టం అయిన ఈ సమయంలో బాలయ్య సినిమా ఇలా నడవడానికి కారణం ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటమే.. అని టాక్ వినిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. ఈ సినిమాకు ఎవరూ రాకపోయినా.. రోజుకొక్క షోతో ఒకటీ రెండు థియేటర్లలో ఆడిస్తున్నారు.. తద్వారా సినిమా చేత రికార్డులు సృష్టింపజేస్తున్నారు.. అని టాక్ వినిపిస్తోంది.

ప్రత్యేకించి ఫేస్ బుక్ లో ఇలాంటి సెటైర్లు పడుతున్నాయి. ఒకవైపు బాలయ్య సినిమా రికార్డులు సృష్టించేస్తోందని ఆయన అభిమానులు చెప్పుకొంటుంటే..  మరికొంతమంది ఇలాంటి సెటైర్లు వేస్తున్నారు. ‘లయన్’ వంటి సినిమా ఆరు రోజులు పాటు కూడా స్టడీ గా కలెక్షన్లను సాధించలేకపోవడం.. లెజెండ్ మాత్రం ఇలా 60 వారాలు నడవడం ఏమిటి? అనే లాజిక్ కూడా వినిపిస్తోంది. మరి ఎవరి లాజిక్కులు వారికి.. ఎవరి అభిమానాలు వారివి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -