Friday, April 26, 2024
- Advertisement -

ఇంట్రస్టింగ్ కాంబోః ఎన్టీఆర్ సినిమాలో జగపతిబాబు..!

- Advertisement -

మొన్నామధ్య బాబాయ్ బాలయ్య సినిమాలో నటించాడు జగపతి బాబు. ‘లెజెండ్’ కు ధీటైన విలన్ గా కనిపించాడాయన. ఇప్పుడు అబ్బాయ్ పక్కన నటించడానికి రెడీ అయిపోతున్నాడు ఈ ఫ్యామిలీ హీరో! సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో జగపతి బాబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

ప్రధానంగా ఈ సినిమా షూటింగ్ యూరప్ లో జరగనుందని సమాచారం. అందుకోసం యూనిట్ మొత్తం తరలి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సినిమాకు కావాల్సిన ఐదు ట్యూన్లను కూడా ఇచ్చాడట దేవీ. సుకుమార్ తో దేవీది ఒక హిట్ కాంబినేషన్. ఇది వరకూ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య-2, 100 పర్సెంట్ లవ్, వన్ వంటి సినిమాల ఆడియోలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది.

మరి ఈ సినిమాలో జగపతి బాబు రోల్ ఏమిటి? అనేది కూడా ఆసక్తికరమైన అంశమే. విలన్ గా నటిస్తున్నాడా.. లేక ఏదైనా ముఖ్యపాత్రను చేయబోతున్నాడా?! అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ విషయాన్ని సినిమా యూనిట్ ఏమైనా ప్రకటిస్తుందో లేక విడుదల వరకూ వేచి చూడమంటుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -