Thursday, April 25, 2024
- Advertisement -

బాలకృష్ణ కు ఈ సినిమా హిట్ పడకపోతే మాత్రం..!!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను తో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. వారి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమా లు బాలకృష్ణ కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.. ఒకరకంగా చెప్పాలంటే బాలకృష్ణ కి అవి కం బ్యాక్ సినిమాలు గా చెప్పొచ్చు.. ఆ సినిమా లు తప్పా ఈ దశాబ్దంలో హిట్లే లేవని చెప్పాలి.. ఎంతో ఆశపడి చేసిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు కథానాయకుడు, మహానాయకుడు జనాలకు అంతగా నచ్చలేవన్న సంగతి అందరికి తెలిసిందే..

కథానాయకుడు పర్లేలేదనుకున్నా, మహానాయకుడు మాత్రం దారుణమైన చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక ఆసినిమా ల తర్వాత వచ్చిన రూలర్ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.. దాంతో బాలకృష్ణ కు సింహ ముందు ఉన్న పరిస్థితి వచ్చింది.. దాంతో సింహా లాంటి హిట్ ఇప్పుడు పడకపోతే ఇక జనాల్లో బాలకృష్ణ కు మార్కెట్ లేని పరిస్థితి.. దాంతో బాలయ్యకు బాగా అచ్చొచ్చిన బోయపాటి శ్రీను ను రంగంలోకి దించారు.. అయితే ఈ సినిమా అసలు ఉంటుందా అని ఓ దశలో చాలామంది అనుకున్నారు.. ఎందుకంటే ఈ సినిమా పై వచ్చినన్ని రూమర్లు గతంలో ఎప్పుడు బాలకృష్ణ సినిమా కు రాలేదు.. మరోవైపు బోయపాటి శ్రీను గత సినిమా వినయ విదేయ రామ కూడా భారీ డిజాస్టర్ కావడంతో ఇద్దరి ఒత్తిడి సినిమా పై పడింది.. అప్పుడే టీడీపీ కూడా ఎన్నికల్లో ఓడిపోవడంతో అన్ని సమస్యలు ఒక్కసారిగా బాలకృష్ణ పై పడ్డాయి..

దాంతో బాలకృష్ణ కు ఈ సినిమా అతికీలకంగా మారింది. ఇక ఈ సినిమా అన్ని హంగులు అద్కుదుని బాలకృష్ణ రేంజ్ లో ముస్తాబవుతుందట.. బోయపాటి శ్రీను కూడా ఎక్కడా కంప్రమైజ్ అవడం లేదట.. ఈ సినిమా లో బాలయ్య ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని ఒక పాత్రకు సీనియర్ హీరోయన్ జోడీ అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆమెను పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో బోయపాటి క్లారిటీ ఇవ్వలేదు. కొన్ని రోజుల క్రితం బోయపాటి బాలీవుడ్ కు చెందిన ఒక మోడల్ అన్నట్లుగా హింట్ ఇచ్చాడు. ఆ విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు సిమ్రాన్ వార్తలపై బోయపాటి ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -