ప్రభాస్ డైరెక్టర్ పై కోపంతో ఉన్న ఫాన్స్..!!

- Advertisement -

ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రభాస్ కు వెంటంటే ఓ భారీ హిట్ పడాలన్న ఆత్రుత ఉంది ప్రభాస్ ఫాన్స్ లో ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన హై వోల్టేజ్ సినిమా సాహో సినిమా బాక్స్ఆఫీస్ దగ్గర బోల్తాపడింది.. బహుబలికి మించి ఈ సినిమా ఉండబోతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సాహో పై మనోళ్ళు భారీ అంచనాలే పెట్టుకున్నారు.. ఇక సుజీత్ లాంటి చిన్న డైరెక్టర్ కి ప్రభాస్ లాంటి పెద్ద ఛాన్స్ ఇచ్చాడంటే స్టొరీ లో ఎదో ఉంటే తప్పా ఛాన్స్ ఇవ్వడు అనుకున్నారు..

కానీ సినిమా వచ్చాక కానీ అర్థం కాలేదు సినిమా ఎలా ఉందో.. ప్రభాస్ ఫాన్స్ హై అంచనాలే ఈ సినిమా అలా పోవడానికి కారణం అనుకున్నారు.. దాంతో ప్రభాస్ నటించే తర్వాత సినిమా అయినా ఓ రేంజ్ లో ఉండాలని ఫాన్స్ ఆశిస్తున్న తరుణంలో రాధే శ్యామ్ మళ్ళీ మళ్ళీ వాయిదా పడడం వారికి ఏమాత్రం నచ్చట్లేదు.. జిల్ లాంటి సినిమా చేసిన రాధ కృష్ణ ఈ సినిమా దర్శకుడు కాగా ఈ సినిమా కి ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది.. అది కూడా ఓ రేంజ్ లో ఉండడంతో సినిమా అంతకుమించి ఉంటుందని ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవకపోవడం తో అభిమానులు కలవరపడుతున్నారు.. ఇక ప్రభాస్ ఈ సినిమా ని ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలీదు కనీ వరుస సినిమా లు ఒప్పుకున్తున్నాడు.. ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తన 21 వ సినిమా చేస్తున్న ప్రభాస్ 22 వ సినిమా గా ఆదిపురుష్ అనే బాలీవుడ్ సినిమా ని అంగీకరించాడు.. పాన్ ఇండియా స్థాయి లో పూర్తిగా భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ ని హాలీవుడ్ స్టార్ ని చేస్తుందని ఫాన్స్ ఇప్పటినుంచే హడావుడి చేస్తున్నారు.. 

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -