Thursday, May 9, 2024
- Advertisement -

విశాఖ టీడీపీ నేతలకు ఎంత కష్టం వచ్చెన్..!!

- Advertisement -

ఎంకి పెళ్లి సుబ్భి సావుకోచ్చిందన్నట్లు చంద్రబాబు విశాఖ కి రాజధాని ని వద్దని చెప్పడం విశాఖ టీడీపీ నేతలకు తలనొప్పిగా మారుతుంది.. తమ ప్రాంతం రాజధానిగా మారుతుండడం ఓ వైపు సంతోషంగానే ఉన్నా మరోవైపు పార్టీ విధి విధానాలను పాటించక తప్పట్లేదు.. దాంతో వారికి గెలిపించిన ప్రజల మాట వినలా, లేడా నమ్మిన నాయకుడి మాట వినాల అనే సంగ్దిగ్దంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ తలనొప్పి ని తట్టుకోలేక కొందరు నేతలు ఇప్పుడు తట్టా బుట్టా సర్దుకుని అధికార పార్టీ లోకి జరుకుని తరువాత చూసుకుందాం అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే గంటా శ్రీనివాస్ రావు లాంటి చాలామంది నాయకులూ పార్టీ మరుతున్నరనే వార్త హల్చల్ అవుతుంది అంటే వారి మీద ఎంత వత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు.. పార్టీ చెప్పినట్లు అమరావతి రాజధాని కావాలని కోరుకుందామా అంటే ఇక్కడి ప్రజలు మళ్ళీ తమ మొహం చూడరు అని భయం.. పోనీ ప్రజల మాట విని విశాఖ కు సపోర్ట్ చేద్దామా అంటే పార్టీ వర్గాలు ఏమనుకుంటాయో అన్న అనుమానంతో వారు టార్చర్ అనుభావిస్తున్నారట.. దీనికి తోడు ఇటీవలే వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఉత్త‌రాంధ్ర‌పై చంద్ర‌బాబు వైఖ‌రిని  చెప్తూ తీవ్రంగా విమర్శించారు..

ఆయ‌న ఈ ప్రాంతంపై విషం చిమ్ముతున్నారని, తనకు సంబంధించిన మనుషులే అభివృద్ధి చెందాలి అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని తమను చంద్రబాబు రెచ్చగొట్టారని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు.  ఇక విశాఖ లో నాలుగు స్థానాలు గెలుపొందిన ఎమెల్యేలు అయిన గంటా శ్రీ‌నివాస‌రావుతో పాటు, గంటా వెంక‌ట‌రెడ్డి నాయుడు (గణబాబు), వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్, వెలగపూడి రామకృష్ణబాబు లు రాజీనామా చేయాలనీ డిమాండ్ వస్తున్న నేపథ్యంలో వారు ఏ నిర్ణ‌యం తీసుకోవాలో తెలియ‌క తీవ్రంగా ఒత్తిడికి గురి అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -