Thursday, May 16, 2024
- Advertisement -

‘ఎన్టీఆర్‌’ సినిమా షూటింగ్ ప్రారంభం

- Advertisement -

తండ్రి పాత్ర‌లో బాల‌య్య అదుర్స్‌

స్వ‌ర్గీయ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ నేప‌థ్యంలో సినిమాలు తీయ‌డానికి ఎంద‌రో మంది చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమా తీస్తాన‌న‌డంతో సంచ‌ల‌న‌మైంది. అయితే ఒక్క‌టీ ఇప్ప‌టివ‌ర‌కు సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. అయితే సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌కృష్ణ తాను తీయాల‌నుకున్న సినిమాను ప్రారంభించేశాడు. ఆ షూటింగ్ గురువారం ప్రారంభ‌మైంది.

నందమూరి తారక రామారావు జీవితం నేప‌థ్యంలో ‘ఎన్టీఆర్‌’ సినిమాను బాల‌కృష్ణ తీస్తున్నారు. ఈ సినిమాను తేజ ద‌ర్శ‌కత్వంలో రానుంది. గురువారం నుంచి హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరితో కలిసి బాలకృష్ణ నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా జనవరి 18వ తేదీన ‘ఎన్టీఆర్‌’ టీజర్‌ని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ సినిమా టీజర్‌ కోసమే షూటింగ్ మొదలు పెట్టారు. అయితే బాల‌కృష్ణ ‘జై సింహా’ సినిమా షూటింగ్ బుధ‌వారం పూర్తి చేసుకొని వెంట‌నే మ‌రుస‌టి రోజు మేక‌ప్ వేసుకున్నాడు. ఆయ‌న న‌టించిన జై సింహా సంక్రాంతికి విడుద‌ల‌వుతోంది. ‘ఎన్టీఆర్‌’ సినిమాను 2019లోనే విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -