Sunday, May 5, 2024
- Advertisement -

ఓరి దేవుడోయ్……. విగ్గుతో చంపేస్తావా ఏంటి బాలయ్యా? సింహం జూలు తెచ్చారా ఏంటి?

- Advertisement -

జై సింహా అనగానే మరో సమర సింహా రెడ్డి, నరసింహ నాయుడు, సింహా లాంటి సినిమాని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు. అయితే ఇది హిలేరియస్ కామెడీ సినిమానా అన్న అనుమానం వస్తోంది? అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం ప్లే చేసిన క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్‌తో బాలయ్య కామెడీ చేయబోతున్నాడా అని అనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అంతా కూడా ఆయన విగ్గు మహత్యం మరి. నిజానికి బాలయ్య విగ్గుతో కూడా ఆయన సినిమాల హిట్స్, ఫెయిల్యూర్స్‌కి సెంటిమెంట్ ఒకటి ప్రచారంలో ఉంది. విగ్గు బాగున్న బాలయ్య సినిమాలన్నీ హిట్స్. విగ్గు తేడాగా ఉన్న సినిమాలన్నీ ఫ్లాప్ అని సినిమా విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో బాలయ్యకు నప్పే విగ్గు సెట్ చేసిన ఘనత బోయపాటి ఒక్కడికే దక్కుతుంది. ఇక మిగతా దర్శకులందరూ కూడా ఫెయిల్.

అయితే ఇప్పుడు జైసింహా డైరెక్టర్ మాత్రం ఆ ఫెయిల్యూర్స్ డైరెక్టర్స్ అందరికీ గురువులా ఉన్నాడు. ఈ సినిమా స్టిల్స్ తాజాగా కొన్ని రిలీజ్ చేశారు. ఆ స్టిల్స్‌లో బాలయ్య వగ్గు చూస్తుంటే అసలు ఎక్కడైనా మామూలు మనిషి హెయిర్ అలా ఉంటుందా అని అనిపిస్తోంది. మరీ తెలుగు వాళ్ళకు, ఇండియన్స్‌కి అయితే అలాంటి హెయిర్ ఉండదు. ఆఫ్రికన్ కంట్రీస్‌లో అలాంటి హెయిర్ స్టైల్‌కి దగ్గరగా ఉండేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మరి బాలయ్య ఈ సినిమాలో ఆఫ్రికన్ ఫారెస్ట్‌లో ఫైటింగ్స్ చేయడాలు గట్రా ఉన్నాయేమో తెలియదు కానీ బాలయ్య విగ్గు మాత్రం మరీ కామెడీగా ఉంది. అసలు సినిమాపైన ఇంప్రెషన్ పోయేలా చేస్తోంది. సంక్రాంతికి బాలయ్య సినిమా వస్తున్నా కూడా ఏ ఒక్క చిన్న సినిమా హీరో కూడా వెనక్కి తగ్గడం లేదు. అందరూ వాళ్ళ సినిమాలను రిలీజ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. బాలయ్య విగ్గు చూశాకే ఈ సినిమా ఫలితంపైన ముందే అందరికీ నమ్మకం వచ్చేసినట్టుంది. మిగతా విషయాలు పక్కనపెట్టినా ఆల్రెడీ నెట్‌లో బాలయ్యపై బోలెడన్ని జోకులు పేలుతూ ఉంటాయి. ఇక ఇలాంటి విగ్గులతో కనిపిస్తూ ఉంటే ఆ కామెడీకి హద్దూ పద్దూ ఉంటుందా? సెటైర్ల వర్షం కురవదా? కనీసం విగ్గు విషయంలో అయినా జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? ఎంత జైసింహా అన్న పేరు పెడితే మాత్రం బాలయ్య విగ్గు కూడా సింహం జూలులా ఉండాలా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -