కత్తి మహేష్ కత్తి ఎంత పదునైనదో పికే ఫ్యాన్స్ కు తెలిసినంత భాగా ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే అతని కత్తి వారికి అంత భాగా దిగింది మరి. అందుకే కత్తి ఎంట్రీ ఇచ్చాడంటే చాలామంది షేక్ అవుతూ ఉంటారు. జనసేనాని సైతం కత్తి మహేష్ దెబ్బకు విలవిలలాడుతున్నాడు.అందుకే పవన్ తన అభిమానులకు మహేష్ పై స్పందించ వద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. పవన్ ఒక్క మహేష్ అనే కాదు..మోడిపై కూడా విరుచుకు పడుతూ ఉంటాడు.
తాజాగా కత్తివారి చూపు దర్శక ధీరుడు జక్కనపై పడింది. అమరావతి అసెంబ్లీ డిజైన్ల సందర్భంగా.. దర్శక ధీరుడు రాజమౌళిని పరోక్షంగా తప్పుబడుతూ ఆయన విమర్శలు చేశాడు. కాని చంద్రబాబు కోరితేనే రాజమౌళి ఇలాంటి డిజైన్ ను రూపొందించి ఇచ్చారు. ఏపీలో నిర్మించనున్న అసెంబ్లీ భవనానికి సంబంధించిన డిజైన్లలో దాన్ని దాదాపు ఖరారు చేశారు. ఎత్తైన టవర్ నుంచి అసెంబ్లీ సెంట్రల్ హాలులోకి సూర్యకిరణాలు పడేలా నార్మన్ ఫోస్టర్ డిజైన్ రూపొందించింది. దర్శకుడు రాజమౌళి తన మార్కు కళాత్మకతకు పదును పెట్టాడు.
అసెంబ్లీ సెంట్రల్ హాలులో తెలుగు తల్లి విగ్రహంపై సరిగ్గా ఉదయం 9.15 గంటలకు కిరణాలు పడేలా ఏర్పాటు చేయాలని సూచించారు. అలా సూర్య కిరణాలు పడుతున్న తెలుగుతల్లి గ్రాఫిక్ వీడియోను రూపొందించిన రాజమౌళి దానిని విడుదల చేయడంతో అందరికీ అది షేర్ అవుతోంది. ఆ వీడియో ఇప్పుడు కత్తి మహేష్ వద్దకు వచ్చింది. అది చూసిన కత్తి మహేష్ వైరైటీగా కామెంట్ పెట్టాడు. తొలి కిరణం.. తెలుగు తల్లి పాదాలను తాకకపోతే వచ్చే నష్టం ఏదైనా ఉందా..? అని కామెంట్ చేశాడు. దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన వాదనను సమర్ధిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా రాజమౌళిని తిట్టినట్లు కాకుండా అలాగని పొగిడినట్లు కాకుండా చేశాడు కత్తి. అందుకే కత్తికి రెండువైపులా పదును ఉంటుందంటున్నారు. ఇది ఎంతమేర దిగిందో తెలియాలంటే జక్కన్న స్పందన బట్టి ఉంటుంది.
