Tuesday, May 7, 2024
- Advertisement -

పవన్‌ని చంపేస్తానన్నవాడు అరెస్ట్….. మరి పవన్ జోలికొస్తే చంపేస్తాం అన్నవాళ్ళ మాటేంటి?

- Advertisement -

పవన్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు…… రెచ్చిపోతున్నారు….. ఎల్లో మీడియా కూడా ఓ స్థాయిలో రెచ్చగొడుతోంది….. ఇక బాబుతో సహా టిడిపి జనాలందరూ కూడా వైకాపాను హంతుకుల పార్టీగా చిత్రీకరించడానికి రెడీ అయిపోతున్నారు. అంతా కూడా వైకాపాలో సభ్యత్వం కూడా లేని ఎవరో ఒక వ్యక్తి చేసిన నిర్వాకం పుణ్యం. అతనికి సోషల్ మీడియాలో ఓ పేజ్ ఉంది. ఆ పేజ్‌లో ఉన్న ఎక్కువ పోస్ట్‌లు జగన్‌కి సంబంధించినవే ఉన్నాయి. అది కూడా పేజ్‌ని చాలా కాలం నుంచీ రన్ చేస్తున్నది కూడా ఏమీ లేదు. సమయం……సందర్భం లేకుండా అతను యూట్యూబ్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేశాడు. అందులో ‘జగన్ జోలికేస్తా చంపేస్తాం’ అంటూ తన చిత్తానికి వాగేశాడు. ఫుల్లుగా మందేసి కూడా ఉన్నాడు. పోలీసులు ఆ వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. అలాంటి వాడు సమాజంలో ఉండడం కంటే కటకటాల వెనుక ఉండడమే కరెక్ట్ అన్న మాట నిజం. కచ్చితంగా అతనిని శిక్షించాల్సిందే. ఆ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వేగంగా స్పందిండం కూడా గొప్ప విషయం. అలాగే వైకాపా నాయకులు కూడా అతనికీ….. పార్టీకీ సంబంధం లేదు….అతనికసలు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు అని చెప్పడం గొప్ప విషయం. పార్టీ దరిదాపుల్లోకి కూడా అలాంటి హింసా ప్రవృత్తి ఉన్నవాళ్ళను రానివ్వమని గట్టిగా హెచ్చరికలు పంపడం అభినందనీయం. ఈ విషయంలో చంద్రబాబు, జగన్‌లిద్దరినీ అభినందించాలి.

ఇక పవన్ విషయానికి వద్దాం.పవన్ మూర్ఖపు అభిమానులు పవన్‌ని విమర్శించే వాళ్ళపై ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో చెప్పనవసరం లేదు. చంపేస్తాం, నరికేస్తాం, బయట తిరగలేవ్ అంటూ హెచ్చరికలు పంపుతూ పవన్‌ని విమర్శించిన వాళ్ళ ఇంటి మహిళలను ప్రస్తావిస్తూ నీచంగా తిడుతూ ఉన్నారు. ఫేస్‌బుక్‌లో మహేష్ కత్తి టైంలైన్‌లో చూస్తే పవన్ అభిమానుల అరాచకాలు ఏంటో అందరికీ అర్థమవుతాయి. మహేష్ కత్తి లాంటి చాలా మంది పవన్ మూఢాభిమానుల బాధితులు ఫేస్‌బుక్‌లో ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ ఏనాడైనా స్పందించాడా? హింసను నేను ప్రోత్సహించను……అభిమానులెవరూ కూడా అలా రాక్షసంగా ప్రవర్తించొద్దు అని చెప్పాడా? అలా చెప్పకపోగా మహేష్ కత్తిపై నాగబాబు ఆధ్వర్యంలో నడుస్తున్న జబర్ధస్త్ షోలో అమానవీయంగా జోక్స్ వేయిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే స్వయంగా పవన్ కూడా మహేష్ కత్తి విమర్శిలను ద్వేషంగా అభివర్ణిస్తూ అభిమానులను ఇంకాస్త రెచ్చగొట్టాడు. నిజజీవితంలో పవన్‌కి గన్స్ అంటే చాలా ఇష్టం. ఆ విషయాన్ని ఆయనే చెప్పాడు. ఇక మానవత్సం, అహింస గురించి కూడా మాటలు చెప్తూ ఉంటాడు. కానీ గన్ కల్చర్, హింసాత్మక ప్రవృత్తినే పవన్‌ని ఎక్కువగా ఆకర్షిస్తుందేమో తెలియదుకానీ…..రెచ్చిపోతున్న పవన్ అభిమానులను ఒక్కసారి కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం మాత్రం చేయలేదు పవన్. దాసరి గారు చనిపోయాక ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి పవన్, అల్లు అర్జున్ వెళ్ళారు. ఆ సందర్భంలో అరుస్తూ, నినాదాలు చేస్తూ ఉన్న అభిమానులను పవన్ కళ్యాణ్ ఇంకాస్త ఎంకరేజ్ చేశాడు. అదే అల్లు అర్జున్ మాత్రం అభిమానులకు అరవొద్దని చెప్పాడు. అలాంటి సందర్భంలో అలా ప్రవర్తించడం తప్పని తన సైగలతోనే చెప్పాడు.

ఆ రెండు వీడియోలు కూడా యూట్యూబ్‌లో ఉన్నాయి. కావాలంటే చూడండి. అదీ పవన్‌కి ఇతర హీరోలకు ఉండే తేడా. చిరంజీవితో సహా ఎన్టీఆర్, మహేష్జ……ఇలా టాప్ హీరోలందరూ కూడా అభిమానులు సంయమనంతో ప్రవర్తించేలా కంట్రోల్ చేసినవారే. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం అలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేసినట్టుగా కనిపించదు. పైగా తనను చంపేసి ఉండేవారు, అత్తారింటికి దారేది లీకేజీ వెనుక భారీ కుట్ర ఉంది…..ఆ కుట్ర ఎవరు పన్నారో నాకు తెలుసు అంటూ అభిమానులు ఇంకాస్త ఆవేశపడిపోయేలా చేస్తూ ఉంటాడు. అత్తారింటికి దారేది కుట్రను తర్వాత చెప్తానన్న పవన్ ఇప్పటి వరకూ మళ్ళీ ఆ విషయం గురించి చెప్పింది ఏమీ లేదు. ఆయన అభిమానుల అరాచకాల పుణ్యమా అని చిరంజీవితో సహా అందరూ ఇబ్బంది పడినవాళ్ళే. ఒక టైంలో అయితే సోషల్ మీడియాలో కూడా పవన్ మూఢాభిమానులను అందరూ విమర్శించారు. కానీ పవన్ మాత్రం అభిమానుల ఆగడాలను నియంత్రించేలా ఇప్పటి వరకూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదీ పవన్ వాస్తవ నైజం.

ఇక ఇక్కడ చంద్రబాబు గురించి కూడా చెప్పుకోవాలి. పవన్ గురించి అమానవీయంగా మాట్లాడినవాడిని 24గంటల్లో అరెస్ట్ చేయించిన చంద్రబాబు ప్రభుత్వం…..నరికేస్తాం, పాతేస్తాం…..అంటూ రెచ్చిపోతున్న పవన్ అభిమానులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. వాళ్ళ వీడియోాలు కూడా అదే యూట్యూబ్‌లో ఇప్పటికీ ఉన్నాయిగా. ఇలాంటి విషయాల్లో కూడా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో చెప్పినట్టుగా నిష్పక్షపాతంగా వ్యవహరించలేడా ది గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అని కోట్లాది రూపాయలతో గొప్పగా ప్రచారం చేయించుకున్న చంద్రబాబు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -